ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
രംഗാരെഡ്ഡി

పీర్జాదిగూడ సాయినగర్‌లో ఘనంగా వినాయక శోభాయాత్ర

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
పీర్జాదిగూడ సాయినగర్‌లో ఘనంగా వినాయక శోభాయాత్ర

ఉప్పల్: పీర్జాదిగూడ, సాయినగర్ కాలనీలో గోల్డెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కలశం, పంచ వేలం పాటలు ఉత్సాహంగా సాగాయి.

వేలం కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పాటలు పాడారు. ఈ సందర్భంగా బి. పాండు గౌడ్–నర్మద దంపతులు రూ.35,000కు కలశాన్ని, రూ.10,000కు పంచను వేలంలో కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పాండు గౌడ్–నర్మద దంపతులు మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో కలశం, పంచను దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వినాయకుడి కృపతో తమ కుటుంబంతో పాటు సాయినగర్ కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గోల్డెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వినాయక శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

పీర్జాదిగూడ సాయినగర్‌లో ఘనంగా వినాయక శోభాయాత్ర

Leave a comment

Your email address will not be published. Required fields are marked *