Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Narayanpet

పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడల్లో కున్సీ పాఠశాల విద్యార్థుల విజయభేరి కబడ్డీ, ఖో-ఖోలో జిల్లా ప్రథమ స్థానం..

Punnami Newsroom Published:
పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడల్లో కున్సీ పాఠశాల విద్యార్థుల విజయభేరి కబడ్డీ, ఖో-ఖోలో జిల్లా ప్రథమ స్థానం..

Story highlights

  • కున్సీ: నారాయణపేట జిల్లాలో అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించిన పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో కున్సీ పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి సత్తా చాటారు.
  • బాలుర కబడ్డీ, బాలికల ఖో-ఖో విభాగాల్లో జిల్లా ప్రథమ స్థానాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
  • బాలుర కబడ్డీలో రఘు, తరుణ్, తిరుమలేష్‌తో పాటు మరో విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

కున్సీ: నారాయణపేట జిల్లాలో అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించిన పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో కున్సీ పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. బాలుర కబడ్డీ, బాలికల ఖో-ఖో విభాగాల్లో జిల్లా ప్రథమ స్థానాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
బాలుర కబడ్డీలో రఘు, తరుణ్, తిరుమలేష్‌తో పాటు మరో విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలికల కబడ్డీలో శ్రావణి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. విద్యార్థినులు ఖో-ఖోలో సమన్వయం, పట్టుదలతో విజయం సాధించారు.
విద్యార్థులకు శిక్షణనిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు సౌమ్యను అభినందించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు బి. సంతోషి, ఉపాధ్యాయులు నరేందర్, ఉష, ఖాసీం అలీ, నర్సింలు, సత్యనారాయణ రెడ్డి, గీత, స్వాతి, ఆరిఫ్, నాగేష్, రాధిక, కృష్ణవేణి, స్మిత విద్యార్థులను అభినందించారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *