డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,
విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:-.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి సమావేశ మందిరంలో జిల్లా లో గల అన్ని ప్రైవేటు హాస్పిటల్స్/లాబ్స్ యాజమాన్యం వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ ప్రైవేటు హాస్పిటల్స్ వారందరూ కూడా హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని మరియు ధరలపట్టిక ను రిసెప్షన్ ఏరియా లో ప్రదర్శించాలని, స్క్రబ్ టైఫస్ వ్యాది గురించి అవగాహన కలుగచేశారు మరియు సీజనల్ వ్యాధుల గురించి ఎపిడిమిక్ విభాగం నందు డా.జగదీశ్ ప్రసాద్ వారికి మరియు హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. లకు సంబంధించి రిజిస్ట్రేషన్లను శ్రీ శశిభూషణ్ డి.పి.ఒ వారికి తెలియచేయాలని తెలిపారు.
ఈ నెల 21.12.2025 న జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమంనకు అందరూ సహకరించాలని ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం వారిని కోరారు. మరియు అన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ మరియు స్కానింగ్ కేంద్రముల రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్ మరియు అన్ని నోటిఫై డిసీజెస్ గురించి సమాచారాన్ని ముందుగా అందచేయాలని ముఖ్యంగా హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. రిజిస్ట్రేషన్స్ పెండింగ్ గల వారిని సమీక్ష చేసి త్వరలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. లేనిపక్షంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం చర్యకు గురికాగలరని హెచ్చరించారు.
ఈ సమావేశం నందు డా.ఉమావతి వారు మాట్లాడుతూ RCH 2.0 గురించి విపులంగా తెలియచేసారు. మరియు హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అని తెలియచేసారు.
ఈ సమావేశం నందు డా.జగదీశ్ ప్రసాద్ DSO వారు మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్ వ్యాధి మరియు మిగతా నోటిఫై డిసీజెస్ గురించి విపులంగా తెలియచేస్తూ ప్రోఫర్మా ఆన్లైన్ లో ఉంచి సమాచారాన్ని ఇవ్వాలని తెలియచేసారు.
తదుపరి శ్రీ బి.నాగేశ్వర రావు డెమో వారు మాట్లాడుతూ PC&PNDT ఫారం-ఎఫ్ పెండింగ్ గల ఆసుపత్రుల వారు త్వరలో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రతీ ఆసుపత్రి నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ పేరు, కాంటాక్ట్ నెంబర్ డెమో విభాగంలో సమర్పించాలని తెలియచేసారు.
ఈ సమావేశం నందు డా.బి.ఉమావతి, DPMO-NHM, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, డా.జగదీశ్ ప్రసాద్, DSO, శ్రీ శశిభూషణ్, DPO, డా.అశోక్, వైరాలజీ ల్యాబ్, KGH మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు.


