📍 నెల్లూరు | 🗓️ జూలై 2, 2025 | 🕔 సాయంత్రం 5 గంటలకు
📌 వేదిక: శ్రీ వెంకటేశ్వర విద్యాలయం, కరెంట్ ఆఫీస్ సెంటర్, నెల్లూరు లో జరుగును.
పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ బాలసాహితీవేత్త
రచయిత, విద్యావేత్త డా. గంగిశెట్టి శివకుమార్ గారిని ఘనంగా సన్మానము జరుగును .ఈ కార్యక్రమానికి విద్యావేత్తలు, సాహిత్యవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు కావలిసినదిగా ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేస్తున్నది.
చిన్నారుల మానసికాభివృద్ధికి తోడ్పడేలా డా. శివకుమార్ గారు రచించిన “కబుర్ల దేవత ” పుస్తకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. “పిల్లల ప్రపంచాన్ని మెరుగుపర్చడమే నా జీవన లక్ష్యం” అని ఆయన పేర్కొంటూ, బాలల పట్ల తన నిబద్ధతను మరోసారి వ్యక్తపరిచారు.
🔹 బాలల హక్కులు, భద్రతపై అవగాహన
🔹 బాలసాహిత్యానికి ప్రాధాన్యత
🔹 పిల్లల విద్య, ఆరోగ్యం పై సమగ్ర చర్చ
🔹 చిన్నారుల కోసం పనిచేసే సంస్థలకు గుర్తింపు అవసరం
🔹 సమాజం పాత్రపై స్పష్టత అవసరం
ఈ సభలో “చలనము” సంస్థ సహకారం తో జరుగుతుంది . ఇది జిల్లాలో బాలల అభివృద్ధి దిశగా ఒక నూతన ప్రయాణానికి నాంది పలికే కార్యక్రమంగా రూపు దిద్దు కొనే అవకాశం ఉంది.
🎓 ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ – నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగు తున్నది.