పిల్లలు – తల్లిదండ్రులు

0
200

పిల్లల పై మనకి ఉన్నది హక్కా?

పిల్లలను గౌరవించాలంటే ముందు తన పై తనకు గౌరవం వుండాలి.

ముఖం మీద కొట్టినట్లుగా రియాక్ట్ అవ్వటం పిల్లలను మీ నుంచి దూరం చేస్తుంది.

ఎంతో ప్రేమతో పెంచి, ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులను గౌరవించలేని సమాజం ఎందుకు తయారవుతుది? ఎంతో ప్రేమగా పెంచిన పిల్లలు అనామకులతో లేచిపోయేది ప్రేమ కోసమా లేక తల్లిదండ్రుల పై పగ కోసమా?
పిల్లల పై మనకి ఉన్నది హక్కా? బాధ్యతా అని ప్రశ్నించుకుంటే బాధ్యత మాత్రమే. హక్కు అన్నది భ్రమ మాత్రమే. కానీ మీరు ఏది ఇవ్వాలి అన్నది మీ చేతుల్లో లేదు. మీ దగ్గర ఉన్నది మాత్రమే మీరు ఇతరులకు ఇవ్వగలరు. అసలు మీ దగ్గర ఉన్నది ఏమిటో మీకు తెలియాలిగా? పిల్లలను గౌరవించాలంటే ముందు తన పై తనకు గౌరవం వుండాలి. సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌తక్కువ ఉన్నవారే పిల్లల పై చీటికి మాటికీ గొంతు పెంచుతుంటారు. పిల్లలు దేముళ్ళని చెప్పే పెద్దలే ఇన్ని తిట్లు తిడుతుంటే, ఇక వారిలోని దైవత్వాన్ని మిగులుస్తారా?
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచిన విధంగా మీ పిల్లల్ని పెంచలేరు. ఎందు కంటే ఆ తరం వారు పిల్లలంతా మంచి వారుగా ఉండాలని తాపత్రయ పడేవారు. బాగా చదువు కోవడం, ఎదురు సమా ధానాలు చెప్పక పోవడం, చెప్పిన మాట వినడం, బుద్ధిమం తుల లక్షణంగా భావిం చే వారు. ఎవరైనా అలా లేనప్పుడు, వీడు ఎందుకూ పనికిరాడు పక్కవారిని చూసి బుద్ధి తెచ్చుకో, నిన్ను చూస్తే మాకు సిగ్గే స్తుంది లాంటి తిట్లతో తిట్టడం వల్లే ఈ నాడు కోట్లాది మంది తమది కాని పనిలో బతుకు బండి లాగిస్తూ తమ అసలైన తత్వం ఏదో తెలియకుండానే జీవించి ఉండగానే మరణించేస్తున్నారు. పిల్లలు చెపుతున్నది వినిపించుకోకుండా, వెంటనే మీ తీర్పు ప్రకటించటం, ముఖం మీద కొట్టినట్లుగా రియాక్ట్ అవ్వటం పిల్లలను మీ నుంచి దూరం చేస్తుంది. వారు స్కూళ్లో జరిగినదేదైనా చెప్పినప్పుడు నువ్వే ఏదో చేసుం టావు అని ప్రతిపక్షంలా అనుమానించటం కాకుండా, పూర్తిగా సావధానంగా వినాలి. ఒక వేళ పిల్లలదే తప్పయితే, అంతా విన్న తర్వాత, ఆవేశపడిపోకుండా, మంచి చెడులు వాటి పర్యవసానాలు వివరించాలి. ‘మేం క్లాసు ఎగ్గొట్టి సినిమాకి వెళ్లాం అనగానే, మీ కోపం నషాళానికి చేరడం వల్ల, వాళ్ళు రేపట్నించి అటువంటి పనులు చేయడం మానరు… కానీ మీకు చెప్పడం మానేస్తారు.
పిల్లల్ని విమర్శించడం, నిందించడం, ఖం డించడం, ఫిర్యాదులు చేయడం చేయ నప్పుడు మీతో అన్నీ చెప్పడానికి ఇష్టపడతారు. పిల్లలకు తప్పు, ఒప్పులు మధ్య వ్యత్యాసాన్ని వివరించ డానికి వారు తప్పు చేసినప్పుడు గొప్ప అవ కాశం లభిస్త్తుంది. భవిష్యత్‌లో నేడు చేసే పనుల పర్యవసానాలని వివరించడమే పిల్లలు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. పిల్లలకు క్రమశిక్షణ బలవంతంగా అలవాటు చేయడం సాధ్యమవ్వని పని. మనం దరికి ఏది వద్దంటే అదే చేయాలనిపించడం సహజం. మీరు కోతి గురించి ఆలోచించకండి అనగానే కోతి మదిలో దర్శనమిస్తుంది.
పిల్లలను గైడ్‌ ‌చేయాలి, కంట్రోల్‌ ‌చేయ కూడదు. ఎవరూ వేరే వారి నియంత్రణకు లోబడి పని చేయడాన్ని ఇష్టపడరు. ఎవరైనా తమను ప్రోత్సహించే వారిని, తమ విజయానికి తోడ్పడేవారిని, ఓటమిలో నిల బడే వారిని, అతిగి విమర్శిం చని వారిని ఇష్ట పడతారు. మీరే దైనా తప్పు చేస్తే మీ పై బాసు ఎలా ప్రవర్తించాలని కోరుకుం టారో, అలాగే పిల్లలు తప్పు చేసి నప్పుడు మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే వారి హృదయా లను గెలువ గలుగుతారు.

బద్దిపూడి శీనయ్య, నెల్లూరు

 

0
0