


భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి వేడుకలలో భాగంగా, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జోన్‌కు చెందిన శ్రీ సత్యసాయి సేవా సమితి – పిన్నింటిపేట ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రతి సంవత్సరం రెండుసార్లు పిన్నింటిపేట గ్రామంలో నిర్వహించే కంటి శిబిరాల ద్వారా, విశాఖపట్నం “శంకర్ ఫౌండేషన్” సౌజన్యంతో ఇప్పటి వరకు సుమారు 2000–3000 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించి సమాజానికి విశేష సేవ అందించారు.
ఈ రోజు, శంకర్ ఫౌండేషన్ స్థాపకులు శ్రీ ఆత్మకూరి శంకర్ రావు గారి 94వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో, పిన్నింటిపేట సేవా సమితి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను వక్తలు ఘనంగా ప్రశంసించారు. ఆర్తజనులకు కాంతులు పంచే ఇలాంటి మహోన్నత సేవలో సమితి ముందంజలో ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన –
“ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో మంచి కార్యక్రమాలు మీ సహకారంతో కొనసాగుతాయి” అని తెలిపారు.

