ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11
ఇటీవల ఏన్కూరు మండల పరిధిలో వర్షాలు, పిడుగులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మండల కేంద్రానికి సమీపంలోని పొలాల్లో పిడుగు పడి పంటలకు నష్టం వాటిల్లింది.వేముల రమేష్ అనే రైతు పొలంలో అర్థ ఎకరానికి పైగా మిర్చి పంటపై పిడుగు పడడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనతో రమేష్ తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు.పిడుగుల కారణంగా పంటలు నష్టపోతుండడంతో గ్రామ రైతుల్లో ఆందోళన నెలకొంది. బాధిత రైతులు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని, వ్యవసాయ శాఖ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


