కామారెడ్డి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పింఛన్ల పెంపు, పింఛన్ల హామీలతో ఆకర్షించగా, అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం వాటిని మరిచిపోయాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను గమనించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా పోరాటాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. ఈ నిరసనల్లో కొత్తోల్ల యాదగిరి మాదిగ, ఆకుల రాజయ్య, రాజా గౌడ్, వంగ దేవయ్య, పురం నరసయ్య, నాదరి బాలయ్య, పందుల మల్లయ్య, కాల బాలయ్య, సూరంపల్లి మొగులయ్య, ఆల నారాయణరెడ్డి, బత్తుల సాయిలు, ఆకుల లక్ష్మి, తాటికొండ లక్ష్మి, కాల మణెమ్మ వంటి వయోవృద్ధులు పాల్గొన్నారు.


