-రాజంపేట నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కాడే చెంచయ్య నాయుడు
డిసెంబరు,01 పున్నమి ప్రతినిధి
పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిదేనని రాజంపేట నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కాడే చెంచయ్య నాయుడు స్పష్టం చేశారు. మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ పోలీసు బెటాలియన్ వద్ద ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఆయన సోమవారం ప్రారంభించారు.లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సమస్యలను అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు,ఆ తరువాత రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచి వారిని ఆదుకున్నారని చెప్పారు.గత ప్రభుత్వ హాయాంలో పింఛన్‌ను రూ.2వేలు నుంచి రూ.3వేలకు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని అన్నారు.పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండేది టిడిపి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతోందని చెప్పారు. తప్పుదోవ పట్టించిన వ్యవస్థను ముఖ్యమంత్రి తన అపార అనుభవంతో గాడిన పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాడే కదిరేగారి శ్రీనివాసులు నాయుడు,సిద్ధవటం టిడిపి అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్, జిల్లా యాదవ సంఘం సెక్రటరీ కృష్ణ, పార్ల శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ సుధీర్ పాల్గొన్నారు.


