Tuesday, 24 March 2026
  • Home  
  • పార్టీ బలోపేతమే అందరి లక్ష్యం కావాలి: తాతంశెట్టి నాగేంద్ర ……..ప్రతి బూత్‌లో ఏజెంట్ నిలబెట్టే స్థాయికి ఎదగాలని పిలుపు …….బూత్ స్థాయినుండి బలపడితేనే, అసెంబ్లీ గెలుపు దూరం కాదు
- అన్నమయ్య

పార్టీ బలోపేతమే అందరి లక్ష్యం కావాలి: తాతంశెట్టి నాగేంద్ర ……..ప్రతి బూత్‌లో ఏజెంట్ నిలబెట్టే స్థాయికి ఎదగాలని పిలుపు …….బూత్ స్థాయినుండి బలపడితేనే, అసెంబ్లీ గెలుపు దూరం కాదు

రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో జనసేన బలోపేతమే ప్రధాన ధ్యేయంగా ఉండాలని రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన రాజుకుంట యువ నాయకులు ఆనాల సునీల్‌కుమార్, మాదినేని కనకరాజ, మాదినేని లోకేష్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన కార్యాలయంలో బుధవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేంద్ర మాట్లాడుతూ – “పవన్ కళ్యాణ్ గారి నీతి, నిజాయితీ, ప్రజా ఆమోదం మేరకు పరిపాలన సాగించే లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం తప్పనిసరి. ప్రతి పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌ను నిలబెట్టే స్థాయికి ఎదగాలి. చిట్వేలి మండలం, రైల్వే కోడూరులో తిరుగులేని శక్తిగా నిలవాలి” అని పిలుపునిచ్చారు. అలాగే పార్టీకి చేరిన సునీల్, కనకరాజ, లోకేష్ మాట్లాడుతూ – “పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం, కార్యకర్తల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగినేని మణి, పగడాల చంద్రశేఖర్, ఆలం రమేష్, ఏనుగుల జగన్మోహన్ రాయల్, పగడాల శివ, శివరాం, తేజ, పగడాల వెంకటేష్, సాదు కిషోర్‌తో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.