దుబాయ్ పు న్నమి ప్రతినిధి:
* పార్టీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై మీడియాలో సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..
* పరిణామాలపై అసంతృప్తి
వివిధ అంశాలపై నేతల బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు..
• ఈ అంశాలపై దుబాయ్ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు..
• ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివాదానికి కారణమైన ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని సీఎం చంద్రబాబుకు చెప్పిన పల్లా శ్రీనివాస్..
• వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదని పల్లాకు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు..
• యూఏఈ నుంచి వచ్చాక పార్టీలో ఘటనలు నేతల వ్యవహారంపై తానే దృష్టి పెడతానని చెప్పిన చంద్రబాబు..
• రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను విదేశాల్లో పర్యటిస్తుంటే కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి..
• పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా పాజిటివ్ నెస్ దెబ్బతీసేలా క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించే వారిని ఇక ఉపేక్షించేది లేదన్న సిఎం..
• ఏవైనా ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలని ఇలా బహిరంగ విమర్శలు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్న సీఎం చంద్రబాబు..
• బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలతో అనవసరమైన చర్చకు తావిచ్చేలా నేతలు వ్యవహరించడం సమంజసం కాదని కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం వచ్చిందని అభిప్రాయ పడిన సిఎం..
• దుబాయ్ నుంచి సిఎం ఇచ్చిన ఆదేశాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల మీటింగ్ ను రద్దు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా..


