
- జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం ,అక్టోబర్ 3:
విశాఖపట్నంలో జరుగనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ కు విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ అధికారులను జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ప్రధాన ఇంజనీర్ పి వి వి సత్యనారాయణ రాజు, ఇతర జీవీఎంసీ అధికారులతో కలిసి ఆర్కే బీచ్ ,పార్క్ హోటల్, సిరిపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ పర్యటనలో ముందుగా కమిషనర్ ఆర్కే బీచ్ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ద్వారా పలు ప్రాంతాలను పరిశీలించి ప్రధాన ఇంజనీర్ కు పలు అభివృద్ధి పనులపై సూచనలు చేశారు. పార్టనర్ షిప్ సమ్మిట్ కు దేశ విదేశాల నుండి విశాఖకు అధిక సంఖ్యలో అతిధులు రానున్నందున విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీసి దిద్దాలన్నారు. నగరంలో అవసరమైన చోట ,అలాగే ముఖ్యంగా బీచ్ రోడ్లో ఫుట్ పాత్ కర్బ్ వాల్స్ మరమ్మతులు, పెయింటింగులు, రోడ్ల మార్జిన్లో వైట్ మార్క్ పెయింటింగ్స్ , స్టడ్స్ ఏర్పాట్లు, ఫుట్పాత్ టైల్స్ మరమ్మతులు,ఎలక్ట్రికల్ పోల్స్ పెయింటింగ్,సమీపంలో ఉన్న టాయిలెట్లు మరమ్మత్తులు ,పెయింటింగులు, రోడ్లు మరమ్మతులు, బస్ స్టాప్ లను అందంగా తీర్చిదిద్దడం, సెంటర్ మీడియన్ల అభివృద్ధి, గ్రిల్స్ పెయింటింగ్ ,అందమైన మొక్కలు ఏర్పాటు, విద్యుత్ అలంకరణ, వీధిలైట్లు మరమ్మతులు, అవసరమగు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసే చర్యలు చేపట్టాలని ప్రధాన ఇంజనీర్ కు కమిషనర్ ఆదేశించారు. అలాగే పార్టనర్ షిప్ సమ్మిట్ పూర్తయ్యే వరకు జీవీఎంసీ అధికారులు, సంబంధిత విభాగాలు సమన్వయంతో అభివృద్ధి ,సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ విషయమై సంబంధిత విభాగాలతో అధికారులతో, సమన్వయ సమావేశం తరచూ నిర్వహిస్తూ సంబంధిత పనులను పూర్తిచేసే చర్యలు చేపట్టాలని ప్రధాన ఇంజనీర్ కు కమిషనర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు కె .శివప్రసాద్ మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజనీర్లు సంపత్ కుమార్, కె.శ్రీనివాసరావు ,రాయల్ బాబు , డి డి హెచ్ ఎం .దామోదర్ రావు ,కార్యనిర్వాహక ఇంజనీర్లు గంగాధర్ ,నర్సింగరావు, మురళీకృష్ణ, సహాయక వైద్యాధికారులు కృష్ణంరాజు, బి.ప్రసాద్ రావు, ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ హార్టికల్చర్ అధికారి, డిఈలు వేయిలు తదితరులు పాల్గొన్నారు

