Tuesday, 24 March 2026
  • Home  
  • పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి.
- విశాఖపట్నం

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్. *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- * ప్రజా ఆరోగ్యపు అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి నరేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్, తో సమీక్ష నిర్వహించగా జూమ్ యాప్ ద్వారా పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం వార్డు శానిటేషన్ ,ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యంలో ఎటువంటి అలసత్వం వహించరాదని, ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ క్లాప్ వాహనాల ద్వారా చేపట్టాలని, అధికారులు సిబ్బంది నిర్ణీత సమయానికే విధుల్లో ఉండి పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అధికారులు ముందుగా సిబ్బంది హాజరును పరిశీలించి వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డుపై పశు సంచారం లేకుండా చూడాలని, పందులు, కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని వెటర్నరి అధికారులను ఆదేశించారు. నగరంలో దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలని అలాగే ప్రతి శుక్రవారం డ్రైడే పాటించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పౌర సేవలు పొందేందుకు పురమిత్ర యాప్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నగరంలో ఉన్న పలు దుకాణాలకు ట్రేడ్ లైసెన్సలు వసూలు చేయాలని, కొత్తగా ఏర్పాటుచేసిన దుకాణాలను గుర్తించి వాటికి ట్రేడ్ లైసెన్స్ లను విధించి వాటిని వసూలు చేయాలని ఆదేశించారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి.

జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్.

*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- *
ప్రజా ఆరోగ్యపు అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి నరేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్, తో సమీక్ష నిర్వహించగా జూమ్ యాప్ ద్వారా పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం వార్డు శానిటేషన్ ,ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యంలో ఎటువంటి అలసత్వం వహించరాదని, ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ క్లాప్ వాహనాల ద్వారా చేపట్టాలని, అధికారులు సిబ్బంది నిర్ణీత సమయానికే విధుల్లో ఉండి పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అధికారులు ముందుగా సిబ్బంది హాజరును పరిశీలించి వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డుపై పశు సంచారం లేకుండా చూడాలని, పందులు, కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని వెటర్నరి అధికారులను ఆదేశించారు. నగరంలో దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలని అలాగే ప్రతి శుక్రవారం డ్రైడే పాటించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పౌర సేవలు పొందేందుకు పురమిత్ర యాప్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నగరంలో ఉన్న పలు దుకాణాలకు ట్రేడ్ లైసెన్సలు వసూలు చేయాలని, కొత్తగా ఏర్పాటుచేసిన దుకాణాలను గుర్తించి వాటికి ట్రేడ్ లైసెన్స్ లను విధించి వాటిని వసూలు చేయాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.