శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాపా నాయుడుపేట లోని జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు మిషన్ శక్తి సంకల్ప పై అవగాహన కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ అనిత వాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు బాలల హక్కులు,గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి,జీవన నైపుణ్యాలలో భాగంగా స్వీయ సంరక్షణ మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలందరూ భవిష్యత్తు లక్ష్యం పైన ఈ రోజున సంకల్పం చేసుకొని దానికి సరిపోయేలాగా రోజువారి ప్రణాళికను తయారు చేసుకుని పాటించాలని తెలియజేశారు.కిశోర బాలికల పోషకాహారం,జీవన నైపుణ్యాలు మొదలగు అంశాల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మారయ్య కళాశాల ప్రిన్సిపల్ జి ప్రభాకర్ రెడ్డి నోడల్ ఆఫీసర్ ఉమా అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

పాపా నాయుడుపేట జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు మిషన్ శక్తి సంకల్ప పై అవగాహన