ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్ శాఖ పీడీ వసంతా భాయ్ సమక్షంలో రేణిగుంట ప్రాజెక్ట్ ఏర్పేడు–3 సెక్టార్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు పాపానాయుడు పేట పీహెచ్‌సీలో హెల్త్ చెకప్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా పాపానాయుడు పేట అంగన్వాడీ కేంద్రాన్ని అధికారులు సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ వసంతా భాయ్, నోడల్ ఆఫీసర్ వాసంతి, సీడీపీఓ కే. కృష్ణవేణి, సూపర్వైజర్ కే. అనిత వాణి, సీహెచ్ఓ రాజేశ్వరి, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎం సిబ్బంది, పీహెచ్‌సీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పాపానాయుడు పేట పీహెచ్‌సీలో అంగన్వాడీలకు ఆరోగ్య పరీక్షలు