సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి):
పుట్టపాక గ్రామంలో ఆర్థిక సమస్యలతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పానుగంటి క్రాంతి వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర తెలంగాణ ప్రాంత మహిళా పద్మశాలి సంఘంఅధ్యక్షులు గుంటక రూప,రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్,జనరల్ సెక్రెటరీ లు మధుర శశికళ – చిన్నకోట్ల స్వప్నరాజ్,కోశాధికారి నోముల రేఖ,గ్రేటర్ ఉపాధ్యక్షులు ఆడెపు శాంతి గారలు పరామర్శించి,వారికి రూ.10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సామల విజయలక్ష్మి,యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సామల భాస్కర్,పుట్టపాక పద్మశాలి సంఘం అధ్యక్షులు గజం హనుమంతు,ఉపాధ్యక్షులు పానుగంటి వెంకట్రావు,సహాయ కార్యదర్శి రావిరాల మల్లేష్,తదితరులు,పాల్గొన్నారు.


