శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫిబ్రవరి 10 – 23, 2026) అత్యంత వైభవంగా రంభమయ్యాయి. ఈ ఉత్సవాల కవరేజీ కోసం వచ్చే పాత్రికేయుల సౌకర్యార్థం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌ను స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మంగళవారం నాడు ఘనంగా ప్రారంభించారు. మీడియా పాయింట్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాల విశేషాలను, స్వామివారి సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకమని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన సూచనలు, ఆలయ నిబంధనలను ప్రచారం చేయాలని పాత్రికేయులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపి రెడ్డి, పాలక మండలి సబ్యులు, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాలు వేణుగోపాల్, పీఆర్వో ఈశ్వర్, పాత్రికేయులు పాల్గొన్నారు.
మీడియావారికి దేవస్థానం వారు కల్పించిన సౌకర్యాలు:
విలేకరులు వార్తలు పంపుకోవడానికి వీలుగా ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించారు. బ్రహ్మోత్సవాల షెడ్యూల్, వాహన సేవల వివరాలను అధికారికంగా మీడియా పాయింట్ ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు.

పాత్రికేయుల సౌకర్యార్థం మీడియా పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫిబ్రవరి 10 – 23, 2026) అత్యంత వైభవంగా రంభమయ్యాయి. ఈ ఉత్సవాల కవరేజీ కోసం వచ్చే పాత్రికేయుల సౌకర్యార్థం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌ను స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మంగళవారం నాడు ఘనంగా ప్రారంభించారు. మీడియా పాయింట్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాల విశేషాలను, స్వామివారి సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకమని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన సూచనలు, ఆలయ నిబంధనలను ప్రచారం చేయాలని పాత్రికేయులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపి రెడ్డి, పాలక మండలి సబ్యులు, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాలు వేణుగోపాల్, పీఆర్వో ఈశ్వర్, పాత్రికేయులు పాల్గొన్నారు. మీడియావారికి దేవస్థానం వారు కల్పించిన సౌకర్యాలు: విలేకరులు వార్తలు పంపుకోవడానికి వీలుగా ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించారు. బ్రహ్మోత్సవాల షెడ్యూల్, వాహన సేవల వివరాలను అధికారికంగా మీడియా పాయింట్ ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు.

