Sunday, 7 December 2025
  • Home  
  • పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్*
- విశాఖపట్నం

పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్*

*పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్* *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-* పాత్రికేయుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరి పై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు కేఎం కీర్తన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అక్రిడేషన్ల మంజూరులో విధిస్తున్న షరతులకు నిరసనగా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జాప్ విశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీర్తన్ మాట్లాడుతూ ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా అక్రిడేషన్ కార్డులను పొడిగిస్తూ రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా చిన్న పత్రికల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబెట్టారు. ఎక్కడ ప్రింటింగ్ డిక్లరేషన్ ఎక్కడ ఉంటే ఆ జిల్లాలో మాత్రమే అక్రిడేషన్లు మంజూరు చేసే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో గతంలో మంజూరు చేసినట్లుగానే ఈ ఏడాది అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తే ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టుల సలహాలను తీసుకోవాలని కీర్తన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నిర్వహించే కార్యక్రమాలు, పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో చిన్న పత్రికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి విడనాడాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో అన్యాయం జరిగితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని కీర్తన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. జర్నలిస్టులను దారిద్యరేఖకు దిగువున ఉన్నవారిగా గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు లేదా పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పలు రాష్ట్రాలు ఇస్తున్న మాదిరిగా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జాప్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి కే అప్పలరాజు,తదితరులు పాల్గొన్నారు.

*పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్*

*విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-* పాత్రికేయుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరి పై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు కేఎం కీర్తన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అక్రిడేషన్ల మంజూరులో విధిస్తున్న షరతులకు నిరసనగా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జాప్ విశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీర్తన్ మాట్లాడుతూ ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా అక్రిడేషన్ కార్డులను పొడిగిస్తూ రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా చిన్న పత్రికల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబెట్టారు. ఎక్కడ ప్రింటింగ్ డిక్లరేషన్ ఎక్కడ ఉంటే ఆ జిల్లాలో మాత్రమే అక్రిడేషన్లు మంజూరు చేసే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో గతంలో మంజూరు చేసినట్లుగానే ఈ ఏడాది అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తే ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టుల సలహాలను తీసుకోవాలని కీర్తన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నిర్వహించే కార్యక్రమాలు, పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో చిన్న పత్రికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి విడనాడాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో అన్యాయం జరిగితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని కీర్తన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. జర్నలిస్టులను దారిద్యరేఖకు దిగువున ఉన్నవారిగా గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు లేదా పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పలు రాష్ట్రాలు ఇస్తున్న మాదిరిగా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జాప్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి కే అప్పలరాజు,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.