చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం పాతపాడు గ్రామంలో గురువారం స్వస్థనారి సొసైటీ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారి డా టి అంశుధర్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు శ్రేయస్సు కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పలు వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవచ్చన్నారు. మహిళలు ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చడం, మరింత మెరుగైన వైద్య సేవలు అందించి వారి కుటుంబాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.అదేవిధంగా మహిళలు ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత సేవలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పి.హెచ్.యన్. జి. నవమణి,హెచ్.వి. యశోద మరియు ఎంపి హెచ్ ఎ(యం/యఫ్) మరియు ఆశాలు,104. సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీస్త్రీలు కిశోర బాలికలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


