శ్రీకాళహస్తి నవంబర్ 09, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్పీ బి ఎస్ జెడ్పి బాయ్స్ హై స్కూల్ ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రస్తుతం 104వ సంవత్సరం జరుగుతున్న తరుణంలో ఈ శత దినోత్సవ వేడుకలు జరుపుకొనుటకు ఆదివారం నాడు పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య, పురుషోత్తం, గోపాలకృష్ణ ,రామచంద్రయ్య, రంగయ్య, చిట్టిబాబు, పూర్వ విద్యార్థులు పాల్గొని రాబోవు సంవత్సరంలో అనగా 2026 వ సంవత్సరంలో ఈ 100 సంవత్సరాల శత దినోత్సవ వేడుకలు జరుపుకొనుటకు ప్రస్తుత తాత్కాలిక కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా తదుపరి కార్యక్రమాలు జరుగుతాయని నిర్ణయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య మాట్లాడుతూ…. తానూ ఈ పాథశాల విద్యార్థినేని ఇప్పుడు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, అలాగే తను చదివిన పాఠశాల ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో శతదినోత్సవాలు వేడుకలు జరుపుకొనుటకు నిశ్చయించడం, అలాగే గత 100 సంవత్సరాల అందుబాటులో ఉన్న పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పాఠశాల శతవార్శికోత్సవాలను విజయవంతం చేయండీ…ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య