Friday, 6 February 2026
  • Home  
  • పాఠశాల నిర్వహుకులతో ఆర్.టి.ఓ ప్రత్యేక సమావేశం
- తిరుపతి

పాఠశాల నిర్వహుకులతో ఆర్.టి.ఓ ప్రత్యేక సమావేశం

శ్రీకాళహస్తి నవంబర్ 06 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ కార్యాలయంలో గురువారం నాడు శ్రీకాళహస్తి పరిధిలోని పాఠశాల, కళాశాలల ర్వహుకులతో ఆర్.టి.ఓ ప్రత్యేక సమావేశం నిరవహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతము అన్ని స్కూల్ బస్సులు భద్రతాపరమైన తనిఖీలు చేయవలసిన అవసరం ఉందని అలాగే కొత్త బస్సులన్నిటికీ ఫైర్ అలారం సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టం ఏర్పాటు చేసి ఉండాలని తెలిపారు. 2019 కంటే పాత వాహనాలకి ఈ సిస్టము అవసరం లేదు కానీ అన్ని బస్సులకి రెండు అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర ద్వారం ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో అద్దాన్ని పగలగొట్టి బయటకు రావడానికి డైమండ్ ఎడ్జ్ హేమర్ ప్రతి వాహనంలో అమర్చాలని తెలిపారు. ప్రతి డ్రైవరు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాన్ని ఎలా వాడాలో తెలుసుకొని ఉండాలని ప్రమాద సమయంలో విద్యార్థులను త్వరితగతిన బస్సు నుండి బయటకు పంపాలని పాఠశాల యాజమాన్యాలు వారికి ఉన్న ప్రతి బస్సును భద్రతాపరమైన అన్ని అంశాలు చట్ట ప్రకారం ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు. ఏ విధమైన లోటుపాట్లు ఉన్న ఎడల సరి చేసుకోవాలని తనిఖీలలో పట్టుబడిన యెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పరిధిలోని కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నవంబర్ 06 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ కార్యాలయంలో గురువారం నాడు శ్రీకాళహస్తి పరిధిలోని పాఠశాల, కళాశాలల ర్వహుకులతో ఆర్.టి.ఓ ప్రత్యేక సమావేశం నిరవహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతము అన్ని స్కూల్ బస్సులు భద్రతాపరమైన తనిఖీలు చేయవలసిన అవసరం ఉందని అలాగే కొత్త బస్సులన్నిటికీ ఫైర్ అలారం సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టం ఏర్పాటు చేసి ఉండాలని తెలిపారు. 2019 కంటే పాత వాహనాలకి ఈ సిస్టము అవసరం లేదు కానీ అన్ని బస్సులకి రెండు అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర ద్వారం ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో అద్దాన్ని పగలగొట్టి బయటకు రావడానికి డైమండ్ ఎడ్జ్ హేమర్ ప్రతి వాహనంలో అమర్చాలని తెలిపారు. ప్రతి డ్రైవరు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాన్ని ఎలా వాడాలో తెలుసుకొని ఉండాలని ప్రమాద సమయంలో విద్యార్థులను త్వరితగతిన బస్సు నుండి బయటకు పంపాలని పాఠశాల యాజమాన్యాలు వారికి ఉన్న ప్రతి బస్సును భద్రతాపరమైన అన్ని అంశాలు చట్ట ప్రకారం ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు.
ఏ విధమైన లోటుపాట్లు ఉన్న ఎడల సరి చేసుకోవాలని తనిఖీలలో పట్టుబడిన యెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పరిధిలోని కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.