సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పవన్.. అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. మాటకు కట్టుబడే తత్వం.. జన సైన్యానికి ధైర్యం. రాజకీయాల్లో విలువలకు పట్టం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు. పవన్ తన అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనతో నిండు నూరేళ్లూ వర్థిల్లాలి’ అని ఆకాక్షించారు. వెండితెరపై పవర్ స్టార్‌గా అలరించి.. రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారని మంత్రి లోకేశ్ కొనియాడారు.

పవన్ పుట్టినరోజు సందర్బంగా… అడుగడుగునా సామాన్యుడి పక్షం సీయం చంద్రబాబు