నిర్మల్, (పున్నమి ప్రతినిధి టి సురేందర్ )*
*పల్లెల్లో మొదలైన స్థానిక సందడి*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు సమాయత్తమవుతున్నది తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం జడ్పిటిసి జడ్పీ చైర్ పర్సన్ ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసింది దీంతో స్థానిక సమరం పై పల్లెల్లో ఆశావాహులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు అంతేకాకుండా తమ బల ప్రదర్శనను చోటా నుంచి బడా నేతల వరకు తమ బలాన్ని నిరూపించుకుంటున్నారు నిర్మల్ జిల్లాలో మొత్తం జెడ్పిటిసి స్థానాలు 18
ఎంపీటీసీ స్థానాలు 157
జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 892
నిర్మల్ జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 18
మొత్తం గ్రామపంచాయతీలు 400
మొత్తం వార్డుల సంఖ్య 3368
మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 3368
రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది ఇప్పటికే సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావాహులు వివిధ రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయా పార్టీల ప్రముఖ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ బల ప్రదర్శనను నిరూపించుకుంటున్నారు గ్రామస్థాయిలో పేరు ఉన్న వారిని కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు గ్రామాల్లో ఎటు చూసినా స్థానిక ఎన్నికలపై చర్చ నడుస్తున్నది స్థానిక సమరంలో సర్పంచ్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవిగా ఆయా పార్టీల నేతలు కూడా పట్టు సాధిస్తున్నారు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరిని పోటీ చేయించాలి . ఎవరిని ఉపసంహరించాలి గ్రామాలలో ఎవరికి పట్టుంది వారిని ఎలా మన వైపు తిప్పుకోవాలి అనే అంశాలపై నియోజకవర్గస్థాయిలో జిల్లా స్థాయిలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతా ఉంది
ఇకపోతే ఎంపీటీసీ ఎన్నికలను కూడా ఇటు అధికారపక్షం అటు ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాయి ఏది ఏమైనప్పటికిని జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పవచ్చు


