నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో శనివారం జరిగిన సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహం గా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసు కున్నారు. ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని ప్రజల సేవలో ఎల్లప్పుడూ ఉంటామని పేర్కొనగా, ఎమ్మెల్యే సౌమ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయ కత్వంలో ప్రతి బలహీన వర్గానికి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. గ్రామ ప్రజలు నాయ కులను తమ మధ్య చూసి ఆనందం వ్యక్తం చేస్తూ, పెన్షన్ పంపిణీ పట్ల చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, చైర్మన్లు, కూటమి నేతలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పల్లగిరి గ్రామంలో సామాజిక సేవా స్ఫూర్తి – పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు