
ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర విభాగంలో అక్టోబర్ 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు ఏయు ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, పర్యావరణ శాస్త్ర విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎంపవరింగ్ ఎన్విరాన్మెంటల్ స్టీవార్డ్ షిప్ (ఇఇఎస్-2025) అంశంపై నిర్వహిస్తున్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య పి. సుభాషిని దేవి, బిఓఎస్ చైర్మన్ ఆచార్య కె. వీరభద్రం, విభాగ విశ్రాంత ఆచార్యులు ఏ.జె సాల్మన్ రాజు, ఆచార్య బి. హేమ శైలజ, ఆచార్య డి. విజయ్ కుమార్, సి. హెచ్.వి రమణ తదితరులు పాల్గొన్నారు.

