పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి
* నగరంలో పర్యాటకుల తాకిడి తో ఉదయం నుంచే మ్యూజియంలు తెరవాలి
* ఆదేశాలు జారీ చేసిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ * **విశాఖపట్నం డిసెంబర్ 27 పున్నమి ప్రతినిధి *
విశాఖకు పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో వి ఎం ఆర్ డి ఎ పరిధిలో పలు పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఆదేశించారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకులు ఎండలో బారులు తీరటాన్ని గమనించి, వారిని విశ్రాంతి గదిలో సేద తీరాలని సూచించారు. ఆదివారం మాత్రమే ఉదయం నుంచి తెరిచి ఉంచుతామని, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం నుంచి తెరుస్తామని అధికారులు చెప్పటంతో పర్యాటక సీజన్ కావటంతో అధిక సంఖ్యలో పర్యాటకులు బారులు తీరుతున్నారని, అందువల్ల వి ఎం ఆర్ డి ఎ పరిధిలో అన్ని మ్యూజియంలను ఉదయం 10 గంటలనుంచే తెరవాలని ఆదేశించారు. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం బయట బారులు తీరుతున్న నేపథ్యంలో క్యూ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు రోప్ లని ఉపయోగించాలని సూచించారు. అలానే మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, బీచ్ రోడ్ లో ఉన్న అన్ని మ్యూజియంల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో రక్షిత తాగు నీటిని అందుబాటులోకి ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి * నగరంలో పర్యాటకుల తాకిడి తో ఉదయం నుంచే మ్యూజియంలు తెరవాలి
పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి * నగరంలో పర్యాటకుల తాకిడి తో ఉదయం నుంచే మ్యూజియంలు తెరవాలి * ఆదేశాలు జారీ చేసిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ * **విశాఖపట్నం డిసెంబర్ 27 పున్నమి ప్రతినిధి * విశాఖకు పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో వి ఎం ఆర్ డి ఎ పరిధిలో పలు పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఆదేశించారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకులు ఎండలో బారులు తీరటాన్ని గమనించి, వారిని విశ్రాంతి గదిలో సేద తీరాలని సూచించారు. ఆదివారం మాత్రమే ఉదయం నుంచి తెరిచి ఉంచుతామని, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం నుంచి తెరుస్తామని అధికారులు చెప్పటంతో పర్యాటక సీజన్ కావటంతో అధిక సంఖ్యలో పర్యాటకులు బారులు తీరుతున్నారని, అందువల్ల వి ఎం ఆర్ డి ఎ పరిధిలో అన్ని మ్యూజియంలను ఉదయం 10 గంటలనుంచే తెరవాలని ఆదేశించారు. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం బయట బారులు తీరుతున్న నేపథ్యంలో క్యూ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు రోప్ లని ఉపయోగించాలని సూచించారు. అలానే మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, బీచ్ రోడ్ లో ఉన్న అన్ని మ్యూజియంల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో రక్షిత తాగు నీటిని అందుబాటులోకి ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

