Thursday, 5 February 2026
  • Home  
  • పరోపకారం సహజంగా పుట్టాలి
- Featured - ఆంధ్రప్రదేశ్ - సాహితీ

పరోపకారం సహజంగా పుట్టాలి

పరోపకారం సహజంగా పుట్టాలి మేఘము దగ్గర నీరు లేనప్పుడు, సము ద్రుని వద్దకు వెళ్ళి నీటిని తెచ్చి లోకానికి వర్షమును ఇస్తుంది. అలాగే పరోపకారం చేసి తీరాలనే కోరికగల దాత, తన దగ్గర లేకపోయినా ఏదో ఒక విధంగానైనా దానం చేసి తీరు తాడు. అంటే తాను కష్ట సమ యంలో ఉన్నప్పుడు కూడా అడిగిన వారికి లేద నక ఇవ్వడమే నిజమైన దాత లక్షణం. కర్ణుడికి గొప్ప దాత అని పేరు రావడం గమనించిన దుర్యోధనుడు తన భవనం ముందు కూడా ఒక దాన ఘంటను కట్టించాడు. దానిని మోగించిన వారికి ఏమి కావా లంటే వాటిని సమకూరుస్తానని ప్రకటించాడు. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు దుర్యో ధనుని దర్శించి, తన కూతురు పెండ్లికి అవసర మయ్యే వంట చెరకును అనుగ్ర హించమని ప్రార్థించాడు. బంగారాన్నో, ధనాన్నో కోరక కేవలం బండెడు కట్టెలను అడిగిన ఆ వెర్రి బాపని అవివేకానికి నవ్వు కొన్న దుర్యోధనుడు వెంటనే తీసుకు వెళ్ళమన్నాడు. అందుకా బ్రాహ్మణుడు ‘‘ మహారాజా! మా ఇల్లు చిన్నది. అందువలన నిలువ చేసుకొనే సౌకర్యం లేదు. అవసర మైనపుడు నేనే వచ్చి తీసుకు పోతాను. ప్రస్తుతానికి తమ మాట చాలు’’! అని చెప్పి సెలవు తీసుకున్నాడు. కొన్ని నెలలు గడిచి పోయాయి. దుర్యోధనుడు ఈ విషయం పూర్తిగా మరిచిపోయాడు. వర్షాకాలం ప్రారంభమైంది. విడవకుండా కురుస్తున్న వర్షాల వలన ఏరులన్నీ ఏకమైనాయి. ఎక్కడా ఎండు కట్టెలన్న మాట కూడా వినబడని పరిస్థితిలో ఈ బ్రాహ్మణుడు ప్రత్యక్షమై, తన బండెడు ఎండు కట్టెలను ఇప్పించమని ప్రార్థించాడు. నివ్వెరపోయిన దుర్యోధనుడు, ‘బ్రాహ్మణోత్తమా! వాతావరణ పరిస్థితిని గమనించావు కదా! కొంచెం ఎండ వచ్చేంత వరకు ఓపిక పట్టు. నీ కోరిక తప్పక నెరవేరు స్తాను’’ అని చెప్పాడు. కానీ అతడు తన కూతురి పెళ్ళి కోసం అప్పుడే వంట చెరకు అవసరమని చెప్పడంతో దుర్యోధనుడు నిస్సహాయుడైనాడు. అక్కడ నుండి సరాసరి కర్ణుని మందిరం చేరుకున్న విప్రుడు తన కథ నంతా వినిపించాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న కర్ణుడు వెంటనే పనివారిని పిలిపించాడు. తన రాజభవనంలో కొంత భాగాన్ని పగులగొట్టించాడు. భవన నిర్మాణానికి వాడిన మంచి చందనం, టేకు దూలాలను, తలుపులను ఒక బండి పై పేర్పిం చాడు. అవి తడవకుండా వాటి పై ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేయించాడు. ఆ బండిని క్షేమంగా బ్రాహ్మణుని ఇల్లు చేర్చమని భటులను పురమాయించాడు. ఆనందంగా బండితో ప్రయాణిస్తున్న బ్రాహ్మణుని చూచిన దుర్యో ధనుడు విషయాన్ని కనుగొన్నాడు. కర్ణుని దాన శీలతకు ఆశ్చర్య పోయి, మనసారా అభినం దించాడు. ‘దాన గుణం అనేది సహజంగా పుట్టవలసినదే కాని ఒకరిని చూచి అనుకరించేది కాదని గ్రహించి, తన వాకిట కట్టిన ఘంటను విప్పి వేయించాడు. నిజానికి దుర్యోధనుని దగ్గర ఉండే ఏ వాడని గుర్రపుశాలో, గోశాలో చాలు బ్రాహ్మణుని అవసరం తీరడానికి! కానీ ఆ ఆలోచనే అతనికి రాలేదు. అందుకనే అందరూ దాతలు కాలేరు. ఆ ఘనత కొంత మందికే దక్కింది. పేరు కోసం, గొప్ప కోసం, పోటీల కోసం దానాలు చేసే మనస్తత్వాన్ని ప్రక్కన పెట్టి, పరోపకారానికి దానం చేసే బుద్ధిని పెంపొందించుకొందాం. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనంత గుప్తంగా పరులకు సహాయం చేద్దాం. ఆ ఆర్తుల రూపంలో వున్న నారాయణునికి సమర్పిస్తున్నామన్న భావ నను కలిగివున్నప్పుడు తప్పక ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమౌతాం. టి.వి.శ్రీధర్‌, ‌గూడూరు.

పరోపకారం సహజంగా పుట్టాలి
మేఘము దగ్గర నీరు లేనప్పుడు, సము ద్రుని వద్దకు వెళ్ళి నీటిని తెచ్చి లోకానికి వర్షమును ఇస్తుంది. అలాగే పరోపకారం చేసి తీరాలనే కోరికగల దాత, తన దగ్గర లేకపోయినా ఏదో ఒక విధంగానైనా దానం చేసి తీరు తాడు. అంటే తాను కష్ట సమ యంలో ఉన్నప్పుడు కూడా అడిగిన వారికి లేద నక ఇవ్వడమే నిజమైన దాత లక్షణం.
కర్ణుడికి గొప్ప దాత అని పేరు రావడం గమనించిన దుర్యోధనుడు తన భవనం ముందు కూడా ఒక దాన ఘంటను కట్టించాడు. దానిని మోగించిన వారికి ఏమి కావా లంటే వాటిని సమకూరుస్తానని ప్రకటించాడు. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు దుర్యో ధనుని దర్శించి, తన కూతురు పెండ్లికి అవసర మయ్యే వంట చెరకును అనుగ్ర హించమని ప్రార్థించాడు. బంగారాన్నో, ధనాన్నో కోరక కేవలం బండెడు కట్టెలను అడిగిన ఆ వెర్రి బాపని అవివేకానికి నవ్వు కొన్న దుర్యోధనుడు వెంటనే తీసుకు వెళ్ళమన్నాడు. అందుకా బ్రాహ్మణుడు ‘‘ మహారాజా! మా ఇల్లు చిన్నది. అందువలన నిలువ చేసుకొనే సౌకర్యం లేదు. అవసర మైనపుడు నేనే వచ్చి తీసుకు పోతాను. ప్రస్తుతానికి తమ మాట చాలు’’! అని చెప్పి సెలవు తీసుకున్నాడు. కొన్ని నెలలు గడిచి పోయాయి. దుర్యోధనుడు ఈ విషయం పూర్తిగా మరిచిపోయాడు. వర్షాకాలం ప్రారంభమైంది. విడవకుండా కురుస్తున్న వర్షాల వలన ఏరులన్నీ ఏకమైనాయి. ఎక్కడా ఎండు కట్టెలన్న మాట కూడా వినబడని పరిస్థితిలో ఈ బ్రాహ్మణుడు ప్రత్యక్షమై, తన బండెడు ఎండు కట్టెలను ఇప్పించమని ప్రార్థించాడు. నివ్వెరపోయిన దుర్యోధనుడు, ‘బ్రాహ్మణోత్తమా! వాతావరణ పరిస్థితిని గమనించావు కదా! కొంచెం ఎండ వచ్చేంత వరకు ఓపిక పట్టు. నీ కోరిక తప్పక నెరవేరు స్తాను’’ అని చెప్పాడు. కానీ అతడు తన కూతురి పెళ్ళి కోసం అప్పుడే వంట చెరకు అవసరమని చెప్పడంతో దుర్యోధనుడు నిస్సహాయుడైనాడు.

అక్కడ నుండి సరాసరి కర్ణుని మందిరం చేరుకున్న విప్రుడు తన కథ నంతా వినిపించాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న కర్ణుడు వెంటనే పనివారిని పిలిపించాడు. తన రాజభవనంలో కొంత భాగాన్ని పగులగొట్టించాడు. భవన నిర్మాణానికి వాడిన మంచి చందనం, టేకు దూలాలను, తలుపులను ఒక బండి పై పేర్పిం చాడు. అవి తడవకుండా వాటి పై ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేయించాడు. ఆ బండిని క్షేమంగా బ్రాహ్మణుని ఇల్లు చేర్చమని భటులను పురమాయించాడు. ఆనందంగా బండితో ప్రయాణిస్తున్న బ్రాహ్మణుని చూచిన దుర్యో ధనుడు విషయాన్ని కనుగొన్నాడు. కర్ణుని దాన శీలతకు ఆశ్చర్య పోయి, మనసారా అభినం దించాడు. ‘దాన గుణం అనేది సహజంగా పుట్టవలసినదే కాని ఒకరిని చూచి అనుకరించేది కాదని గ్రహించి, తన వాకిట కట్టిన ఘంటను విప్పి వేయించాడు. నిజానికి దుర్యోధనుని దగ్గర ఉండే ఏ వాడని గుర్రపుశాలో, గోశాలో చాలు బ్రాహ్మణుని అవసరం తీరడానికి! కానీ ఆ ఆలోచనే అతనికి రాలేదు. అందుకనే అందరూ దాతలు కాలేరు. ఆ ఘనత కొంత మందికే దక్కింది.
పేరు కోసం, గొప్ప కోసం, పోటీల కోసం దానాలు చేసే మనస్తత్వాన్ని ప్రక్కన పెట్టి, పరోపకారానికి దానం చేసే బుద్ధిని పెంపొందించుకొందాం. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనంత గుప్తంగా పరులకు సహాయం చేద్దాం. ఆ ఆర్తుల రూపంలో వున్న నారాయణునికి సమర్పిస్తున్నామన్న భావ నను కలిగివున్నప్పుడు తప్పక ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమౌతాం.

టి.వి.శ్రీధర్‌, ‌గూడూరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.