Friday, 20 February 2026
  • Home  
  • పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ సునీల్ దత్
- ఖమ్మం

పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ సునీల్ దత్

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రికజిల్లా ఇంచార్జి) ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రజా పరీక్షల సందర్భంగా అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో బి ఎన్ ఎస్ లోని సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగించేందుకు ఈ నిర్ణయం3 తీసుకున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలబడటాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దిన పత్రికజిల్లా ఇంచార్జి)

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రజా పరీక్షల సందర్భంగా అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో బి ఎన్ ఎస్ లోని సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగించేందుకు ఈ నిర్ణయం3 తీసుకున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలబడటాన్ని నిషేధించినట్లు వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.