Sunday, 7 December 2025
  • Home  
  • పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత- సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్దన్ రెడ్డి
- Featured

పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత- సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్దన్ రెడ్డి

01-06-2020 (పున్నమి ప్రతినిధి)రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మనం-మన పరిశుభ్రత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు. ఆరు నెలల్లో వ్యర్ధరహిత గ్రామంగా మార్చేందుకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలం నుంచి రెండు గ్రామ పంచాయతీలను ఎన్నుకుంటారు. ప్రజలకు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం తద్వారా గ్రామాన్ని వ్యర్ధరహిత గ్రామంగా తీర్చిదిద్దడం ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. వ్యర్థాలను సేకరించినందుకు గాను గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి రోజూ లేదా వారానికి .ప్రతి ఇంటి నుంచి రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 చెల్లించాలి. దీని ద్వారా 500 కుటుంబాలకు రూ.30 వేలు వస్తుంది. ఈ నగదును ఎంపిక చేసిన గ్రామ వాలంటీర్‌, గ్రామ పెద్ద పేరుతో సంయుక్తంగా బ్యాంకు ఖాతాను తెరచి జమ చేస్తారు. పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించి, పంచాయతీలో పని చేసే గ్రీన్‌ అంబాసిడర్లు ఇద్దరు, ఒక గ్రీన్‌ గార్డుకు మొత్తం ముగ్గురికి రూ.6వేల చొప్పున రూ.18 వేలు నెలకు చెల్లించాలి. మిగిలిన రూ.12 వేలను చెత్త రవాణా చేసే వాహనాల మరమ్మతులు, ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ ప్రాంగణంలో పచ్చదనం పెంపు, చీపుర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఉపయోగిస్తారు. మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రారంభించారు.మొదట అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఆయన మాట్లాడుతూ కరోనా వలన ఊహించని పరిస్థితి లను మూడునెలలు ఎదుర్కొన్నామన్నారు. గ్రామాలన్నీ సామరస్యంగా వుండేందుకుకృషి చేస్తామన్నారు..ఎవరు ప్రభుత్వానికి సలహాలుఇవ్వాల్సినఅవసరంలేదని మాజీమంత్రి సోమిరెడ్డి ని పరోక్షంగా విమర్శించారు.సంక్షేమ పథకాలకు సంబంధించిక్యాలెండర్ ప్రకటించిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో తనను భాగస్వామ్యం చేసినందుకు అందరికి ధన్యవాదములు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటిచంద్రశేఖర్ రెడ్డి,చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్న మాల ప్రభాకర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,బుజ్జిరెడ్డి,రమణకుమార్ రెడ్డి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

01-06-2020 (పున్నమి ప్రతినిధి)రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మనం-మన పరిశుభ్రత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు. ఆరు నెలల్లో వ్యర్ధరహిత గ్రామంగా మార్చేందుకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలం నుంచి రెండు గ్రామ పంచాయతీలను ఎన్నుకుంటారు.
ప్రజలకు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం తద్వారా గ్రామాన్ని వ్యర్ధరహిత గ్రామంగా తీర్చిదిద్దడం ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. వ్యర్థాలను సేకరించినందుకు గాను గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి రోజూ లేదా వారానికి .ప్రతి ఇంటి నుంచి రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 చెల్లించాలి. దీని ద్వారా 500 కుటుంబాలకు రూ.30 వేలు వస్తుంది. ఈ నగదును ఎంపిక చేసిన గ్రామ వాలంటీర్‌, గ్రామ పెద్ద పేరుతో సంయుక్తంగా బ్యాంకు ఖాతాను తెరచి జమ చేస్తారు. పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించి, పంచాయతీలో పని చేసే గ్రీన్‌ అంబాసిడర్లు ఇద్దరు, ఒక గ్రీన్‌ గార్డుకు మొత్తం ముగ్గురికి రూ.6వేల చొప్పున రూ.18 వేలు నెలకు చెల్లించాలి. మిగిలిన రూ.12 వేలను చెత్త రవాణా చేసే వాహనాల మరమ్మతులు, ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ ప్రాంగణంలో పచ్చదనం పెంపు, చీపుర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఉపయోగిస్తారు. మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రారంభించారు.మొదట అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఆయన మాట్లాడుతూ కరోనా వలన ఊహించని పరిస్థితి లను మూడునెలలు ఎదుర్కొన్నామన్నారు. గ్రామాలన్నీ సామరస్యంగా వుండేందుకుకృషి చేస్తామన్నారు..ఎవరు ప్రభుత్వానికి సలహాలుఇవ్వాల్సినఅవసరంలేదని మాజీమంత్రి సోమిరెడ్డి ని పరోక్షంగా విమర్శించారు.సంక్షేమ పథకాలకు సంబంధించిక్యాలెండర్ ప్రకటించిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో తనను భాగస్వామ్యం చేసినందుకు అందరికి ధన్యవాదములు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటిచంద్రశేఖర్ రెడ్డి,చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్న మాల ప్రభాకర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,బుజ్జిరెడ్డి,రమణకుమార్ రెడ్డి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.