పరమాత్ముని ఆజ్ఞలను ప్రవక్త పద్ధతులలో అవలంబించి మనిషి మనశ్శాంతి పొందగలుగుతాడని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మౌలానా అబ్దుల్ వహీద్ నవమని పేర్కొన్నారు. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మౌలానా అబ్దుల్ వహీద్ నౌమని వేంచేశారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష నంద్యాల రోడ్డులో గల మక్కా మసీదు నందు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని పలువురు ప్రముఖ ముస్లిం సోదరులు ఆయనను కలిసి తమ సమస్యల పరిష్కారం కోరారు. మనిషి ఎప్పుడైతే ఆ పరమాత్మని ఆజ్ఞలను ప్రవక్త అడుగుజాడల్లో అమలు చేస్తారో అలాంటి చోట శాంతి సుఖాలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు తాము తమ కుటుంబాలలో ఉన్నటువంటి బాధలు భయాలను ఆయన ముందర ప్రస్తావించారు. సమస్యలు ఎన్ని ఉన్నా పరిష్కారం ఒకటేనని అది ఆ పరమాత్ముని మార్గమేనని అందుకు అనుసరించాల్సిన జపాలను, పద్ధతులను వారికి వివరించారు. మనిషి అత్యాశకు పోయి స్వార్థంతో ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా నేను ఒక్కడినే బాగుంటే చాలు అన్న ధోరణి విడవాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న ప్రవక్త ప్రవచనాలనుఅనుసరించినప్పుడు సమస్యలు వాటికై అవే సమస్య పోతాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి పరోపకారం ఇధం శరీరం అన్న సూక్తిని అనుసరించాలన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రముఖ పుర ప్రముఖులు వలి షేక్ హర్షద్ అబ్దుల్ ఖాదర్ బాబా షేక్ దస్తగిరి అమీర్ భాష గౌస్ పీర్ ఆటో గౌస్ మసీదుల్లా నాయక్ సిమెంట్ పని మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

పరమాత్ముని మార్గమే అన్ని సమస్యలకు పరిష్కారం