Thursday, 5 February 2026
  • Home  
  • ‘పబ్లిక్ స్పీచ్’ ఎడిటర్ సుంకర రాజాకు ఘన నివాళి అమ్మను కంటికి రెప్పలా చూసుకోండి: పిల్లలకు గంట్ల శీను బాబు హితవు
- విశాఖపట్నం

‘పబ్లిక్ స్పీచ్’ ఎడిటర్ సుంకర రాజాకు ఘన నివాళి అమ్మను కంటికి రెప్పలా చూసుకోండి: పిల్లలకు గంట్ల శీను బాబు హితవు

విశాఖపట్నం: డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ‘పబ్లిక్ స్పీచ్’ పత్రిక ఎడిటర్ సుంకర రాజా పెద్దకర్మ కార్యక్రమాన్ని శనివారం రామటాకీస్ ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద నిర్వహించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో సుంకర రాజా మృతి చెందిన విషయం విదితమే. ఈ కార్యక్రమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శీను బాబు హాజరై సుంకర రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సుంకర రాజా మరణించిన రోజే ఆయన కుటుంబానికి రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం అందజేసిన గంట్ల శీను బాబు, పెద్దకర్మ రోజున కూడా కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సుంకర రాజా కుమారులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలని, ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని సూచిస్తూ తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొని సుంకర రాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

విశాఖపట్నం: డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ‘పబ్లిక్ స్పీచ్’ పత్రిక ఎడిటర్ సుంకర రాజా పెద్దకర్మ కార్యక్రమాన్ని శనివారం రామటాకీస్ ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద నిర్వహించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో సుంకర రాజా మృతి చెందిన విషయం విదితమే. ఈ కార్యక్రమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శీను బాబు హాజరై సుంకర రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సుంకర రాజా మరణించిన రోజే ఆయన కుటుంబానికి రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం అందజేసిన గంట్ల శీను బాబు, పెద్దకర్మ రోజున కూడా కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సుంకర రాజా కుమారులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలని, ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని సూచిస్తూ తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొని సుంకర రాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.