47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీకి మూడు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ – 2025 జాతీయ అవార్డులు.
*విశాఖ ప్రజలు, ప్రజాప్రతినిధులు , కౌన్సిల్ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే జి.వి.ఎం.సి కి ఈ ఉత్తమ జాతీయ స్థాయి అవార్డులు.
*1. బెస్ట్ సి.ఎస్.ఆర్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ కేర్ – ప్రథమ స్థానం.
2. బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎ కార్పొరేట్ క్యాంపెయిన్ – ప్రథమస్థానం .
3. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ – ద్వితీయ స్థానం.
కేటగిరీలలో జాతీయ అవార్డులు జి వి ఎం సి కైవసం.
*విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి*: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) ఆధ్వర్యంలో “Empowering Growth, Preserving Roots – The PR Vision for 2047” అనే థీమ్‌తో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ – 2025లో మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ( జి వి ఎం సి) మూడు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ – 2025 జాతీయ అవార్డులు సాధించిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి ప్రారంభోత్సవం చేయగా డిసెంబర్ 14వ తేదీన అవార్డుల ప్రధానోత్సవం ఉత్తరాఖండ్ శాసనసభ గౌరవనీయ స్పీకర్ శ్రీమతి రీతూ ఖండూరీ భూషణ్ , ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్ , పి.ఆర్.ఎస్.ఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అజిత్ పాఠక్ చేతుల మీదుగా జి వి ఎం సి కి ఈ జాతీయ అవార్డులు అందజేయబడ్డాయని కమిషనర్ తెలిపారు.
విశాఖపట్నం నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు అందించిన నిరంతర సహకారం, భాగస్వామ్యం, ప్రోత్సాహంతో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళల సాధికారత ,అభ్యున్నతి, మహిళల ఆర్థిక బలోపేతం,సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు , ప్రజా అవగాహన,ప్రచార,సామాజిక మాధ్యమ కార్యక్రమాలు, బాల్యం విద్యా కేంద్రాలలో బాలల ఆరోగ్యం, విద్య,భద్రత, పోషణ,సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలకు గానూ జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించిందని కమిషనర్ తెలిపారు.
జీవీఎంసీకి లభించిన జాతీయ అవార్డుల కేటగిరీల వివరాలు.
1. బెస్ట్ సి.ఎస్.ఆర్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ కేర్ – ప్రథమ స్థానం.
బాలల సంక్షేమం,ఆరోగ్య రక్షణ కు ఉత్తమ CSR ప్రాజెక్ట్ – విశాఖ నగరంలో జి వి ఎం సి నిర్వహిస్తున్న బాల్యం విద్యా కేంద్రాలలో బాలల ఆరోగ్యం, విద్య,భద్రత, పోషణ,సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల అమలుకు.
2. బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎ కార్పొరేట్ క్యాంపెయిన్ – ప్రథమస్థానం .
జి వి ఎం సి కార్పొరేట్ స్థాయి ప్రచారంలో సామాజిక మాధ్యమాల ఉత్తమ వినియోగం – విశాఖ నగరంలో ప్రజలకు అందిస్తున్న నగర సేవలు, పాలన, ప్రజా అవగాహన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా సమర్థవంతంగా ప్రజలకు చేరవేసినందుకు.
3. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ – ద్వితీయ స్థానం.
మహిళల సాధికారత,సామాజిక, ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి, సామర్థ్య వృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు అమలు చేసినందుకు.
ఈ అవార్డులను జీవీఎంసీ తరపున జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణ మూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వర రావు అందుకోవడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా అవసరాలను కేంద్రంగా చేసుకుని జీవీఎంసీ చేపడుతున్న కార్యక్రమాలకు లభించిన గౌరవంగా ఈ అవార్డులను భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ప్రజలతో బలమైన కమ్యూనికేషన్‌తో పాటు సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

