మొంథా తుఫాను ప్రభావం కారణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కి హెచ్చరిక
మొంథా తుఫాను పై ఆరా :
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రతపై క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీసిన మంత్రి నారా లోకేష్
వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి క్షేతస్థాయి పరిస్థితులను వాకబు చేసిన మంత్రి నారా లోకేష్
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో ఫోన్లో మాట్లాడిన మంత్రి లోకేష్
మొంథా తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఈ రోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు సూచించిన మంత్రి లోకేష్
అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని శాసనసభ్యులకు సూచించిన మంత్రి లోకేష్
సంక్షోభ సమయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్
డ్రెయిన్లు పొంగి ప్రవహించకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
అలెర్ట్స్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ప్రతి రెండు గంటలకోసారి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారా లోకేష్..


