Tuesday, 9 December 2025
  • Home  
  • పద్మభూషణ్ కీర్తిశేషులు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి పురస్కరించుకొని, ఆనందోబ్రహ్మ వారు ధ్యానం, గానం, నాట్యం.
- తూర్పు గోదావరి

పద్మభూషణ్ కీర్తిశేషులు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి పురస్కరించుకొని, ఆనందోబ్రహ్మ వారు ధ్యానం, గానం, నాట్యం.

ఈరోజు విక్రమ హాల్ నందు పద్మభూషణ్ కీర్తిశేషులు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి ని పురస్కరించుకొని, ఆనందోబ్రహ్మ వారు ధ్యానం, గానం, నాట్యం మేలవించి చక్కటి కార్యక్రమమును ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రోటేరియన్ తీగెలరాజా పాల్గొన్నారు. తీగెలరాజా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆనందోబ్రహ్మ సంస్థవారిని ముఖ్యంగా డాక్టర్ గోపాలకృష్ణ వారి కమిటీ వారిని అభినందిస్తూ ఇటువంటి ఈ సమాజానికి చాలా అవసరం అని ధ్యానం ద్వారా మన ఆరోగ్యాన్ని చక్కభరచుకోవచ్చని మందులకి కూడా లొంగని మొండి వ్యాధులను కూడా ధ్యానంతో తగ్గించవచ్చని తెలుపుతూ చిన్నతనం నుండి పిల్లల్లో కూడా ఈ ధ్యానం చేసుకున్న నేర్పించను వారి జీవన ప్రయాణానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ శేఖర్, నందిని వారి గానామృతం వినిపించినారు, విజయనగరవాసి అనేక దేశాల్లో ప్రదర్శన ఇచ్చిన భరతనాట్యం కళాకారుని కుమారి యామిని చక్కటి తన నాట్యముతో కార్యక్రమంలో రక్తి కట్టించి నారు, గాయకుడు సిద్ధార్థ కుమార్తె నాట్యం ఎంతో ఆనందం కలిగించింది పోస్ట్ మాస్టర్ ప్రసాద్ స్నేహమేరా జీవితం అనే పాట పాడి పరవశింపజేసినారు. బుచ్చిబాబు తమ మిమిక్రీ కళ ను అద్భుతం గా వున్నది, కార్యక్రమమును ఉపాధ్యాయులు రత్న కుమారి ముందుండి నడిపించినారు. కార్యక్రమమునకు డాక్టర్ గోపాలకృష్ణ అధ్యక్షత వహించినారు. అధిక సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి శ్వాస తీసుకునుటలో సాధన చేసినారు.

ఈరోజు విక్రమ హాల్ నందు పద్మభూషణ్ కీర్తిశేషులు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి ని పురస్కరించుకొని, ఆనందోబ్రహ్మ వారు ధ్యానం, గానం, నాట్యం మేలవించి చక్కటి కార్యక్రమమును ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రోటేరియన్ తీగెలరాజా పాల్గొన్నారు.

తీగెలరాజా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆనందోబ్రహ్మ సంస్థవారిని ముఖ్యంగా డాక్టర్ గోపాలకృష్ణ వారి కమిటీ వారిని అభినందిస్తూ ఇటువంటి ఈ సమాజానికి చాలా అవసరం అని ధ్యానం ద్వారా మన ఆరోగ్యాన్ని చక్కభరచుకోవచ్చని మందులకి కూడా లొంగని మొండి వ్యాధులను కూడా ధ్యానంతో తగ్గించవచ్చని తెలుపుతూ చిన్నతనం నుండి పిల్లల్లో కూడా ఈ ధ్యానం చేసుకున్న నేర్పించను వారి జీవన ప్రయాణానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుప్రీమ్ శేఖర్, నందిని వారి గానామృతం వినిపించినారు, విజయనగరవాసి అనేక దేశాల్లో ప్రదర్శన ఇచ్చిన భరతనాట్యం కళాకారుని కుమారి యామిని చక్కటి తన నాట్యముతో కార్యక్రమంలో రక్తి కట్టించి నారు, గాయకుడు సిద్ధార్థ కుమార్తె నాట్యం ఎంతో ఆనందం కలిగించింది పోస్ట్ మాస్టర్ ప్రసాద్ స్నేహమేరా జీవితం అనే పాట పాడి పరవశింపజేసినారు. బుచ్చిబాబు తమ మిమిక్రీ కళ ను అద్భుతం గా వున్నది, కార్యక్రమమును ఉపాధ్యాయులు
రత్న కుమారి ముందుండి నడిపించినారు. కార్యక్రమమునకు డాక్టర్ గోపాలకృష్ణ అధ్యక్షత వహించినారు. అధిక సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి శ్వాస తీసుకునుటలో సాధన చేసినారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.