Saturday, 14 March 2026
  • Home  
  • పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్త్ – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్త్ – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్త్ – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఈ నెల మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో మరియు సమాధాన పత్రాలను తిరిగి తరలించే సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు కేంద్రాల వద్ద ఉండరాదని స్పష్టం చేశారు. అలాగే పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగేందుకు ఇతర శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరు కావాలని, తల్లిదండ్రులు కూడా ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా చూడాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి ఘటన జరిగిన వెంటనే DIAL 100 / 112 కు లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9392903143 కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్త్ – జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు.
ఈ నెల మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించారు.
పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో మరియు సమాధాన పత్రాలను తిరిగి తరలించే సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు కేంద్రాల వద్ద ఉండరాదని స్పష్టం చేశారు. అలాగే పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగేందుకు ఇతర శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరు కావాలని, తల్లిదండ్రులు కూడా ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా చూడాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి ఘటన జరిగిన వెంటనే DIAL 100 / 112 కు లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9392903143 కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.