Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kadapa

పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం

Punnami Newsroom Published: Updated:
పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం

Story highlights

  • పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం పున్నమి ప్రతినిధి, కడప: రిజిస్ట్రేషన్‌ మరియు స్టాంపుల శాఖలో 38 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించిన పి.వి.ఎన్.
  • బాబు, జిల్లా రిజిస్ట్రార్‌, కడప, నేడు 04-10-2026న పదవీ విరమణ చేయనున్నారు.
  • తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, శాఖ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన పి.వి.ఎన్.

పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం

పున్నమి ప్రతినిధి, కడప: రిజిస్ట్రేషన్‌ మరియు స్టాంపుల శాఖలో 38 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించిన పి.వి.ఎన్. బాబు, జిల్లా రిజిస్ట్రార్‌, కడప, నేడు 04-10-2026న పదవీ విరమణ చేయనున్నారు.

తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, శాఖ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన పి.వి.ఎన్. బాబు సేవలను అధికారులు, సహచరులు, ఉద్యోగులు ఘనంగా కొనియాడారు.

ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా సత్కారం నిర్వహించి, ఆత్మీయ అభినందనలు తెలియజేసేందుకు పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి కడప ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై. ఓబులేష్ నందన్, కడప మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర తదితరులు హాజరై పి.వి.ఎన్. బాబును ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయనున్నారు.

38 సంవత్సరాల విశిష్ట సేవలకు సెల్యూట్‌! పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం ఆనందమయం, ఆరోగ్యమయం కావాలని అధికారులు, సహచరులు, మిత్రులు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *