కామారెడ్డి, 25 అక్టోబర్పు, (పున్నమి ప్రతినిధి) :
కామారెడ్డి జిల్లా పరిధిలోగల గ్రామాలలో (లవని ) ఇప్పుడు భూమి హద్దుల యుద్ధానికి చిహ్నంగా మారింది. పాత పట్టాలు, కొత్త సర్వేలు, మాయం అయిన హద్దులు, రెవిన్యూ నిర్లక్ష్యంతో రైతుల మధ్య తగాదాలు రోజువారీ దృశ్యంగా మారాయి. పాత పెద్దమనుషుల తీర్పులు దూరమయ్యాయి, కొత్త సాంకేతికత రైతు పక్షాన నిలబడడంలేదు. ఒకప్పుడు నాగల్లు వేసిన పొల హద్దులు ఇప్పుడు జేసీబీల దెబ్బకు చెదిరిపోయాయి.
పట్టా ఉన్నా రక్షణ లేదు….
రైతు చేతిలో ప్రభుత్వ గుర్తించిన పట్టా ఉన్నా, భూమిపై హక్కును కాపాడుకోవడం కష్టంగా మారింది. పక్క రైతులు లేదా పాత వేసిన పొలాల వారసులు హద్దులు చెరిపేసినా, అధికార విభాగా లు తలదూర్చడంలేదు. “పట్టా ఉంది కానీ మా పొలం లేదు” అంటున్న లవని రైతులు నిరాశతో ఉన్నారు.ఇలాంటి సంఘటనలు ఇప్పుడు అనేక గ్రామాల్లో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. పట్టా రైతులు పోలీస్ స్టేషన్లకెళ్లినా ఇది రెవిన్యూ ఇష్యూ అని వారు చేతులు ఎత్తేస్తున్నారు. తాహాసిల్దార్ కార్యాలయాలు సైతం “సర్వేయర్‌ను కూలీ పెట్టు కోండి” అని కుదిపేస్తున్నాయి. ఇంతలో రైతు మధ్యలో చిక్కుకుంటూ, హక్కుకు హామీ లేకుండా మిగిలిపోతున్నాడు.
రెవిన్యూ గందరగోళం… సత్యం ఎవరిదీ?
సంవత్సరాల పాటు సాగుచేసిన పంట పొలాలు ఇప్పుడు రికార్డుల్లో వేరొకరి హద్దులుగా మారిపో తున్నాయి. పాత ‘ఫిర్కా మ్యాప్స్’లో ఒక దారి, కొత్త డిజిటల్ రికార్డుల్లో మరో దారి. ఈ వ్యత్యాసం వ్యవసాయంలోని ప్రశాంతతను కదిలిస్తోంది. (లవని) ఘటనలో రికార్డు అస్పష్టతే ఘర్షణకు కారణమైంది.
భువనాలు క్షేత్రాల్లోనే కాదు… కోర్టుల్లో కూడా…..
తగాదాలు పంచాయతీ స్థాయిలో పరిష్కారం కావడం లేదనే దీనికి పెద్ద విచారకార అంశం. పెద్ద మనుషుల తీర్పులు చట్టబద్ధత కోల్పోవ డంతో, చట్టపరమైన మార్గమే మార్గమైపోయింది.చిన్న హద్దు వివాదం నెలలకొద్దీ కోర్టుల్లో ఇరుక్కు పోతుం ది. రైతు ఒక పంట కాలం న్యాయం కోసం ఖర్చు చేస్తే, మరో పంట కాలం అప్పు తీర్చడానికి కష్టప డాల్సి వస్తోంది.
సమగ్ర భూ సర్వే తప్పనిసరి…
ఈ పరిస్థితికి పరిష్కారం ఒక్కటే — స్పష్టమైన భూ సర్వే. ప్రతి గ్రామంలో భూముల హద్దులను సాంకేతికంగా, ధృవీకృతంగా నిర్ధారించే “సమగ్ర సర్వే” మాత్రమే ఈ పునరావృత వివాదాలకు ముగింపు కావచ్చని రైతులు అభిప్రాయపడుతు న్నారు. పట్టాదారు రైతుల భూములు భద్రంగా ఉండేలా రక్షణ చట్టాలు పటిష్టం చేయాలి.
రైతుల వాదన….
పట్టా రైతులు కష్టపడి భూమిని సాగుచేస్తారు.పట్టా పత్రం చేతిలో ఉండి పొలం చేరకపోవడం ప్రజాస్వా మ్య పరిపాలనకే సవాలు. లవని గ్రామం ఒక సంకే తం — రైతు హక్కు కాగితం మీద కాకుండా నేల మీద ఉండాలి.సర్వే ఆధునీకరణతో పాటు న్యా య వ్యవస్థ రైతు పక్షాన నిలబడితేనే ఈ మట్టి విలువ నిలుస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం భూమి హక్కు ల సంరక్షణను రైతు గౌరవానికి సమానంగా చూడా ల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.


