Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Narayanpet

పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి: బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి కృష్ణ మండలం ముడుమాల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

Punnami Newsroom Published: Updated:
పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి: బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి కృష్ణ మండలం ముడుమాల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

Story highlights

  • కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మక్తల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణ మండలంలోని పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించేలా మండల నాయకులు ఇంటింటికీ వెళ్లి వారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని సూచించారు.

కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మక్తల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణ మండలంలోని పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించేలా మండల నాయకులు ఇంటింటికీ వెళ్లి వారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని సూచించారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యావంతుడు బీజేపీ వైపు చూస్తున్నారని, వారిని ఆకర్షించే విధంగా వ్యూహంతో పనిచేసి వారికి చేరువ కావాలని నాయకులకు సూచించారు.
అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కట్ట వద్ద హైమాక్స్ లైట్ ఏర్పాటు కోసం భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *