Sunday, 22 February 2026
  • Home  
  • పగడాల నాగరాజు ఇంటికి పోటెత్తిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
- ఖమ్మం

పగడాల నాగరాజు ఇంటికి పోటెత్తిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం: అక్రమ అరెస్టుతో 22 రోజుల పాటు ఖమ్మం జిల్లా జైలులో ఉన్న ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన తర్వాత ఆయన నివాసానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఆదివారం కూడా ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులు కూరాకుల నాగభూషణం, బత్తుల మురళి తదితరులు నాగరాజును కలిసి పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నాగరాజుపై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు. పార్టీ కోసం పోరాటం చేసిన నాయకుడికి అండగా నిలుస్తామని తెలిపారు. కార్యకర్తలు “బీఆర్ఎస్ జిందాబాద్” నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. నాగరాజు మాట్లాడుతూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి)

ఖమ్మం: అక్రమ అరెస్టుతో 22 రోజుల పాటు ఖమ్మం జిల్లా జైలులో ఉన్న ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన తర్వాత ఆయన నివాసానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఆదివారం కూడా ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులు కూరాకుల నాగభూషణం, బత్తుల మురళి తదితరులు నాగరాజును కలిసి పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఆయనకు మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నాగరాజుపై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు. పార్టీ కోసం పోరాటం చేసిన నాయకుడికి అండగా నిలుస్తామని తెలిపారు. కార్యకర్తలు “బీఆర్ఎస్ జిందాబాద్” నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు.

నాగరాజు మాట్లాడుతూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.