Monday, 23 March 2026
  • Home  
  • పక్కింటి గోడ చెక్కేసి వివాదం – పెద్ద బజార్‌లో ఉద్రిక్తత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పక్కింటి గోడ చెక్కేసి వివాదం – పెద్ద బజార్‌లో ఉద్రిక్తత

పెద్ద బజార్‌లో గోడ చెక్కేసి వివాదం పెద్ద బజార్‌, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): పెద్ద బజార్‌లో పోర్టు కూల్చే క్రమంలో గోడకు సంబంధించిన వివాదం చోటుచేసుకుంది. వాకాటి వసంతకుమార్ కుమారుడు సురేష్ ఇటీవల ఒక పోర్టును ₹1 కోటి 25 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొనుగోలు చేసిన ఆస్తిని కూల్చివేయడం జరుగుతున్న సమయంలో పక్కింటి గోడ సమస్య తలెత్తింది. స్థానికుల సమాచారం ప్రకారం, సురేష్ వారు కూల్చుతున్న పోర్టు పక్కన ఉన్న ఇంటి యజమానుల గోడ 18 అంగుళాల మందంగా ఉండగా, పనివారు పొరపాటున 16 అంగుళాల మేర గోడ చెక్కేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. పక్కింటి వారు ప్రశ్నించగా, సురేష్ వైపు నుండి “ఏం పీకుతావో పీక్కో, కోర్టుకెళ్తే పో, చూసుకుంటాం” అనే విధంగా మాటల తూటాలు ఎగిరాయి. ఈ మాటలతో పరిస్థితి మరింత వేడెక్కింది. వివాదం తీవ్రమవుతుండడంతో అక్కడికక్కడే పెద్ద ఎత్తున స్థానికులు గుమికూడారు. ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ, పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇప్పటికే పక్కింటి వారు కోర్టుకు వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించగా, ప్రస్తుతం కోర్టులో కూడా ఈ కేసు నడుస్తోంది. పెద్ద బజార్‌లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

పెద్ద బజార్‌లో గోడ చెక్కేసి వివాదం

పెద్ద బజార్‌, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి):
పెద్ద బజార్‌లో పోర్టు కూల్చే క్రమంలో గోడకు సంబంధించిన వివాదం చోటుచేసుకుంది. వాకాటి వసంతకుమార్ కుమారుడు సురేష్ ఇటీవల ఒక పోర్టును ₹1 కోటి 25 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొనుగోలు చేసిన ఆస్తిని కూల్చివేయడం జరుగుతున్న సమయంలో పక్కింటి గోడ సమస్య తలెత్తింది.

స్థానికుల సమాచారం ప్రకారం, సురేష్ వారు కూల్చుతున్న పోర్టు పక్కన ఉన్న ఇంటి యజమానుల గోడ 18 అంగుళాల మందంగా ఉండగా, పనివారు పొరపాటున 16 అంగుళాల మేర గోడ చెక్కేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది.

పక్కింటి వారు ప్రశ్నించగా, సురేష్ వైపు నుండి “ఏం పీకుతావో పీక్కో, కోర్టుకెళ్తే పో, చూసుకుంటాం” అనే విధంగా మాటల తూటాలు ఎగిరాయి. ఈ మాటలతో పరిస్థితి మరింత వేడెక్కింది.

వివాదం తీవ్రమవుతుండడంతో అక్కడికక్కడే పెద్ద ఎత్తున స్థానికులు గుమికూడారు. ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ, పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇప్పటికే పక్కింటి వారు కోర్టుకు వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించగా, ప్రస్తుతం కోర్టులో కూడా ఈ కేసు నడుస్తోంది. పెద్ద బజార్‌లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.