తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను విద్య పట్ల ఒత్తిడికి గురి చేయవద్దు
అదనపు పాఠ్య కార్యక్రమాలలో పాల్గొనడం కూడా చాలా ముఖ్యం :
జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్*
తిరుపతి, పున్నమి ప్రతినిధి (రోసిరెడ్డి) నవంబర్ 1 :విద్యార్థులకు చదువుతోపాటు అదనపు పాఠ్య కార్యకలాపాలలో పాల్గొనడం కూడా చాలా ముఖ్యం అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం స్థానిక SGS ఆర్ట్స్ కళాశాల మైదానంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగవ బాలోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్..జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాలోత్సవo కార్యక్రమం పండగ వాతావరణంలో ఉందని ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు అదనపు పాఠ్య కార్యకలాపాలలో పాల్గొనడం కూడా చాలా అవసరమని, వీటి వలన పిల్లలలో సృజనాత్మక శక్తి మెరుగుపడుతుందని తెలిపారు. ఎక్కువ శాతం మంది పిల్లలను క్లాస్ రూమ్ గదులుకే పరిమితం చేయడం జరుగుతుందనీ అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఒకటవ తరగతి నుంచే విద్యార్థులు డాక్టరు, ఇంజనీర్ కావాలని లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, ఇతర అవసరాలు దృష్ట్యా ఇంగ్లిష్ భాష పైన ఎక్కువ దృష్టి పెట్టడం, కళాశాలల్లో , పాఠశాలల్లో ఇంగ్లిష్ భాష లో మాట్లాడాలని నిబందన పెట్టడం వలన విద్యార్థులు తెలుగు బాష పై పట్టు కోల్పోతున్నారని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడం వలన పిల్లలలో నమ్మకం, ప్రేరణ కలిగి ఆదర్శ విద్యార్థులుగా ఎదుగుతారని తెలిపారు. విద్యార్థులు ఈ మద్య కాలంలో చెడు వ్యసనాలకు గురవుతున్నారని ఇలాంటి కార్యక్రమాలను జరపడం వలన చెడు వ్యసనాల వైపు దృష్టి వెళ్ళకుండా చేయగలగవచ్చన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లాల్లో మరిన్ని జరపాలని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా జిల్లా యంత్రాంగం అందిస్తుందని ఇక్కడి వచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అని తెలిపారు. జిల్లా విద్యాశాఖాదికారి మాట్లాడుతూ… బాలోత్సవo కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందని ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచే కాకుండా చుట్టుప్రక్కల కాకుండా ప్రాంతాల పాఠశాలల విద్యార్థులు కూడా హాజరవడం జరుగుతుందని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి కే.వి.ఎన్ కుమార్, బాలోత్సవo కమిటీ చైర్మన్ టెంకాయల దామోదరం, కస్తూరిబా గాంధీ ట్రస్టు చైర్మన్ పి.సి. రాయలు, రోటరీ క్లబ్ అద్యక్షలు రాజేంద్ర శెట్టి, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుంట్ల, క్రియా పిల్లల పండుగ సెక్రెటరీ కాకినాడ జగన్నాథ రావు, ఎస్.జి.ఎస్. కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


