*పండితుల సంక్షేమమే* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు లక్ష్యం*
*పున్నమి ప్రతినిధి హైదరాబాద్:: తేదీ 23/03/ 2026*
ఘనంగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (RUPP) డైరీ ఆవిష్కరణ
రవీంద్ర భారతిలో మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగిందని అధ్యక్ష అధ్యక్షులు నరసింహులు తెలిపార
సంఘం ముఖ్య నేతలు
కే.గోపాల్ జి, అమీర్ పాషా ,
మానపురి వెంకటేశ్వర్లు, కే.ఇజ్రాయిల్ , నర్సింగ్ రావు,
ప్రవీణ్ కుమార్, తదితర నాయకుల బృందం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
లతోపాటు ప్రముఖ కవి
ఆచార్య ఎన్ .గోపి ఎందరో కవులు కళాకారుల కలిసిన
బృందం, కొన్ని సూచనలు చేస్తూ మెమోరండం సమర్పించడం జరిగిందని తెలిపారు
పాఠశాల విద్యలో తెలుగు భాష వికాసం కోసం
పండిత పరిషత్ చేస్తున్న కృషిని అదేవిధంగా ఉగాది రోజున దైనందిని డైరీ ఆవిష్కరణ చేయడం పట్ల రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారి తో పాటు పలువురు కవులు కళాకారులు అభినందించారు.
ఈరోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు – తెలంగాణ రాష్ట్ర శాఖ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.*
గౌరవ భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ *జూపల్లి కృష్ణారావు* గారు మరియు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ *ఏనుగు నరసింహారెడ్డి* గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరించబడింది.
*మంత్రి గారికి విన్నపం*
ఉపాధ్యాయులందరికీ TET నుండి మినహాయింపు ఇవ్వాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇతర రాష్ట్రాల తరహాలో పాస్ పర్సంటేజీని తగ్గించి నూతన జీవో (G.O.) విడుదల చేయాలని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
పండుగ రోజైనప్పటికీ, మా విన్నపాన్ని మన్నించి ఆకస్మికంగా సమయం కేటాయించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో
*✅ శ్రీ గోపాల్జీ గారు (రాష్ట్ర గౌరవ సలహాదారులు)*
*✅ శ్రీ అమీర్ పాషా గారు (రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి*)
*✅ డాక్టర్ మానుపురి వెంకటేశ్వర్లు గారు (వికారాబాద్ జిల్లా* *అధ్యక్షులు)*
*✅ శ్రీ ఇశ్రాయేలు గారు* *(హైదరాబాద్ జిల్లా* *అధ్యక్షులు)*
*✅ శ్రీ నర్సింగరావు గారు (హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి)*
*✅ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు (హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు*)
*ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న నాయకత్వానికి, కార్యనిర్వాహక వర్గానికి రాష్ట్ర శాఖ పక్షాన హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు*


