వి.కోట , సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
దసరా సందర్భంగా అమ్మవారి అలంకరణ కోసం వి.కోట నుండి చిత్తూరు పంపిన పూల సంచి APSRTC హైరాబస్ లో పార్సల్‌గా బుక్ చేయబడింది. రసీదు నం. 69732986తో పంపిన ఈ పార్సల్ బస్సు చిత్తూరు చేరినా, పార్సల్ కార్యాలయంలో అందలేదు. అధికారులు నిర్లక్ష్యంగా స్పందించారు. చివరకు బస్సు కొంగారెడ్డిపల్లి వద్ద నిలిపి, రాత్రి 10 గంటలకు పార్సల్ లభించింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. “గుడ్ గవెరెనెన్స్” పేరిట సేవలని చెప్పుకుంటూ, ఈ విధమైన ఘటనలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయుతున్నాయి. ఇకనైనా బస్సు సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని, ఈ రకం సమస్యలు మరల జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు


