పంజాబ్‌లో సంచలనం సృష్టించిన ఘటనలో రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్చరణ్ సింగ్ భుల్లర్ను CBI అధికారులు లంచం కేసులో అరెస్ట్ చేశారు. 8 లక్షల రూపాయలు లంచంగా స్వీకరిస్తుండగా ఆయన పట్టుబడ్డారు. అనంతరం అధికారుల బృందం హర్చరణ్ సింగ్ ఇంటి, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా, 5 కోట్ల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారు నగలు, 22 లగ్జరీ వాచీలు, ఆడి, మెర్సిడెస్ కార్లు, అనేక తుపాకులు, పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. భారీ సొమ్ము స్వాధీనం కావడంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. మరిన్ని సోదాలు కొనసాగుతున్నాయని CBI వెల్లడించింది. రేపు ఇద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నారు.

పంజాబ్ IPS ఆఫీసర్ ఇంట్లో 5 కోట్ల నగదు స్వాధీనం – CBI అరెస్ట్!