
పంజాబ్‌లో నిర్వహిస్తున్న జాతీయ తైక్వాండో నేషనల్ క్యాడెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది ప్రతిభావంతులైన ప్లేయర్లు ఎంపికయ్యారు. రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ లోహిత్, రోహిత్, జోషిత తదితర క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు వెళ్తున్నారు.
ప్లేయర్స్‌తో పాటు కోచ్ గౌతం, హరి, తైక్వాండో శ్రీను సహా శిక్షణ బృందం కూడా ఈ జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్నారు.
ఈ సందర్భంగా, పోటీలకు వెళ్తున్న మొత్తం ప్లేయర్స్‌కు అవసరమైన టీ-షర్ట్స్‌ను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన పొట్నూరు గిరీష్, తన మిత్రులు, భవానీ, హర్ష, నీహాల్ ఉచితంగా దానం చేయడం విశేషం. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ చేసిన ఈ సేవకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు


