శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గం పంగూరు గ్రామంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. తిరుపతి తిరుపతి పార్లమెంటు సబ్యుడు మద్దిల గురుమూర్తి చొరవతో గ్రామంలో ఆధునిక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామస్థుల అభ్యర్థనలు, నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి సూచనల మేరకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయగా, ఆ నిధులతో ప్లాంట్ నిర్మాణం పూర్తి అయింది. బుధవారం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల సమక్షంలో ప్లాంట్‌ను ఘనంగా ప్రారంభించారు. దీంతో చాలా కాలంగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పంగూరు ప్రజలకు ఇప్పుడు స్వచ్ఛమైన నీరు సులభంగా లభించనుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యను పరిష్కరించిన బియ్యపు మధుసూదన రెడ్డి, అలాగే నిధులు మంజూరు చేసి గ్రామానికి ఉపశమనం కలిగించిన ఎంపీ మద్దిల గురుమూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పంగూరులో తాగునీటి సమస్యకు ఎంపీ నిధులతో శాశ్వత పరిష్కారం