–పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత ప్రభుత్వానిదే కెఎల్ఆర్
రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి అక్టోబర్ 24 :
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం అల్మాస్ గూడ గ్రామ పరిధి
4 వ డివిజన్ న్యూ మధురాపురి కాలనీలో
ప్రజా అవసరాల కోసం వదిలేసిన పబ్లిక్ స్థలాన్ని కొంత మంది అక్రమార్కులు
కబ్జా చేయాలని ప్రయత్నిస్తూన్న విషయాన్నీ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి కలనివాసులతో కలసి మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి
దృష్టికి తీసుకెళ్లటంజరిగింది గతంలో మధురాపురి కాలనీ అమరావతి కాలనీకి సంబంధించి దాదాపు 8 నుండి పది ఎకరాల ల్యాండ్ ప్లాట్లుగా లే అవుట్ చేసి ప్లాట్లు సేల్ చేయటం జరిగింది అయితే ఈ లే అవుట్ కి సంబంధించి న ల్యాండ్ లో ఒక నీటి బావి స్థలం ఉండేది అట్టి స్థలాన్ని దాదాపు 800 చదరపు అడుగుల స్థలాన్ని ఓపెన్ ల్యాండ్ గా చూపెట్టి ఈ స్థలం ఈ లే అవుట్ కి సంబందించిన ప్లాట్ల యజమానులు పార్క్ స్థలంగా ఉపయోగించు కోవచ్చని గతంలో బిల్డర్లు చెప్పారని ఇప్పుడేమో ఎవరో కొంతమంది భూకబ్జాదారులు వచ్చి
మా కాలనీకి చెందాల్సిన పార్క్ స్థలాన్ని ఆక్రమించటానికి ప్రయత్నిస్తు ఇంతవరకు ఆ స్థలం రిజిస్ట్రేషన్ కాలేదు కానీ ఏదో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇంటి నంబర్ కోసం మున్సిపాల్టీ లో ప్రయత్నిస్తు ఉన్నారని కాబట్టి ఇట్టి పార్క్ స్థలం మా కాలనీకి అప్పగించే విదంగా మీరు చొరవ చూపాలని మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది స్పందిస్తూ తప్పకుండా పార్క్ స్థలాలని
కాపాడతామని అదే విదంగా పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత ప్రభుత్వానిదే అని ఈ విషయం కమీషనర్ తో మాట్లాడి కాలనీకి సంబందించిన స్థలాలను తక్షణం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని పార్క్ స్థలాలు అభివృద్ధి అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని చెబుతానని కాలనీ వాసులకు హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లా రెడ్డి , బోయపల్లి గోవర్ధన్ రెడ్డి పాటు
న్యూ మధురా పురి కాలనీ సంక్షేమ సంఘం
అధ్యక్షుడు పి.నవీన్ రెడ్డి మరియ సంతోష్ చారి ,వంశీ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.


