శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన స్థానిక యువ న్యాయవాది తిరుకాల ఉమా మహేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన శిష్యుడిని సీనియర్ న్యాయవాది సున్నపు లక్ష్మీపతి రెడ్డి తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి రెడ్డి మాట్లాడుతూ.. ఉమా మహేష్ న్యాయవాద వృత్తిని స్వీకరించిన నాటి నుండి ఎంతో క్రమశిక్షణతో మెలిగారని, న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన లోతైన అధ్యయనమే నేడు ఈ ఉన్నత స్థానానికి చేర్చిందని ప్రశంసించారు. ఉమా మహేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తిరుకాల మల్లికార్జున గౌడ్, సుమతి, సోదరుడు సోహిత్ పడిన కష్టానికి, ఉమా మహేష్ సాధించిన విజయంతో సరైన ఫలితం లభించిందని కొనియాడారు. ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులు బషీర్ అహ్మద్, , మోహన్ బాబు తదితరులు ఉమా మహేష్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన విజయ ప్రయాణం తోటి యువ న్యాయవాదులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

న్యాయవాది నుంచి జడ్జి వరకు..ఉమా మహేష్ విజయయాత్ర అభినందనీయం!