శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన తిరుకాల ఉమా మహేష్ అరుదైన ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో ఆయన ప్రతిభ చాటి, న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. తిరుకాల మల్లికార్జున్ కుమారుడైన ఉమా మహేష్, చిన్నతనం నుంచే క్రమశిక్షణతో చదువుకుని నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమా మహేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారన్న వార్త తెలియగానే శ్రీకాళహస్తి న్యాయవాద లోకంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో పనిచేసి, ఇప్పుడు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతుండటం గర్వకారణమని వారు కొనియాడారు. పట్టణ ప్రముఖులు, తోటి న్యాయవాదులు, మిత్రులు ఉమా మహేష్ నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన, కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసించారు. తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, గురువులకు ఉమా మహేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

న్యాయమూర్తిగా ఎంపికైన న్యాయవాది ఉమా మహేష్ ఎంపిక