పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వృద్ధులు ఆవేదన
అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
పిల్లలు లేరని చెల్లెలు కొడుకును దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తే మామ ఆస్తి పైన కన్నేసి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్న సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం వావిలేరు గ్రామంలో చోటుచేసుకుంది.వావిలేరు గ్రామానికి చెందిన అమ్మినేని రమణయ్యకి పెళ్లయినా పిల్లలు లేరు.ఆయన చెల్లెలు కొడుకు పెంచలయ్యని దత్తత తీసుకొని పెద్ద వాడిని చేసి రమణయ్యే ఇంటి పక్కనే స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇస్తే మాకు వృద్దాప్యం వచ్చిన తరువాత మా ఆస్తి మీద కన్ను వేసి మా ఇల్లు పొలం తనకు కావాలంటూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని వృద్ధ దంపతులు మీడియా ముందు ఆవేదనతో విలపించారు. కనీసం బాత్ రూమ్ లోకి వెళ్లేందుకు కూడా లేకుండా తాళాలు వేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.స్థానిక ఎస్సైకి కంప్లైంట్ ఇచ్చి మూడు రోజులు అవుతున్నా న్యాయం చేయలేదని, ఏమని అడగడంతో మంత్రి పిఏ కమల్ అనే అతను ఫోన్ చేస్తున్నాడని వెళ్లొద్దంటున్నాడని సాకులు చెప్పి మాకు న్యాయం చేయకుండా స్థానిక ఎస్సై కాలయాపన చేస్తున్నాడు అంటూ వారు వాపోయారు.గ్రామంలో ఉన్న కొందరు అతని వైపే సపోర్టు చేస్తుండడంతో మాకు న్యాయం చేసే వారు లేకుండా పోయారన్నారు.సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ద దంపతులు వేడుకుంటున్నారు.


